పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత తెరమీద కనబడబోతున్న వకీల్ల్ సాబ్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సినిమా ప్రమోషన్ల విషయంలో చాలా తొందర పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలని మరింత పెంచడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు.
టైటిల్ రివీల్ చేయడంతో అభిమానుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. అయితే ఆ టైటిల్ పోస్టర్ చూసిన చాలామంది బాగుందని ప్రశంసిస్తుంటే కొందరు మాత్రం సినిమా కథకి, పోస్టర్ కి అస్సలు సంబంధమే లేదని, ఆడవాళ్ళ గురించి సినిమా అయితే పోస్టర్ మీద ఒక్కరైనా ఆడవాళ్ళు ఎందుకు లేరని, ఇదంతా మగాళ్ల అధికారం ప్రదర్శించడమేనని విమర్శించారు. మరి వారి మాటలని చిత్ర బృందం సీరియస్ గా తీసుకుందో మరేంటోగానీ ఈరోజు రివీల్ చేసిన మగువ మగువ పాటతో స్త్రీ వాదులందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఆడవాళ్ల గురించి చెబుతూ, వారి గొప్పదనాన్ని వివరించే పాట పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండడమనేది నిజంగా వారికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. మొన్న విమర్శించిన వారే నేడు వకీల్ సాబ్ ని ప్రశంసిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాని చేయడమే ఆడవాళ్ళకి చాలా గౌరవమిచ్చినట్టని, పవర్ ఫుల్ ఆక్టర్ అలాంటి సినిమాల్లో నటిస్తే, దాని గురించి చాలామంది తెలుసుకుంటారని, ఆ విధంగా పవన్ కళ్యాణ్ పింక్ సినిమాని ఒప్పుకోవడంతోనే మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చినట్టు అని అంటున్నారు.