Advertisementt

మంచు విష్ణుతో భరణి చేయనని చెప్పాడా..?

Sun 08th Mar 2020 07:06 PM
manchu vishnu,tanikella bharani,hollywood,prabhas,  మంచు విష్ణుతో భరణి చేయనని చెప్పాడా..?
is Tanikella bharani say no to Manchu vishnu? మంచు విష్ణుతో భరణి చేయనని చెప్పాడా..?
Advertisement
Ads by CJ

వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న మంచు విష్ణు ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మోసగాళ్ళు పేరుతో ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తారట. అయితే మంచు విష్ణుకి చాలారోజుల నుండి భక్తకన్నప్ప సినిమా చేయాలని ఉందట. మూడేళ్ల క్రితమే ఈ సినిమా తనికెళ్ళ  భరణి దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించారు. కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగక ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.

కన్నప్ప సినిమా గురించి ఎవరూ మాట్లాడకపోయేసరికి ఇక ఆ సినిమా ఉండదనే నిర్ణయానికి వచ్చేశారు. కానీ తాజాగా విష్ణు ఈ సినిమా గురించి మాట్లాడాడు. భక్త కన్నప్ప సినిమాను తాను తప్పకుండా తీస్తానని ప్రకటించాడు. తాను ఊహించుకునే కన్నప్ప సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ రేంజ్ లో ఉంటుందట. అందువల్ల అంతటి రేంజ్ ఉన్న సినిమాని తనికెళ్ళ భరణి చేయలేనని చెప్పాడట.

కళాత్మక సినిమాలు తీసే తనికెళ్ళ భరణి అంత పెద్ద బడ్జెట్ సినిమాని హ్యాండిల్ చేయలేనని చెప్పడంతో పక్కకి వెళ్ళిపోయిందట. అయితే మంచువిష్ణు ప్రస్తుతం చేస్తున్న హాలీవుడ్ మూవీ పూర్తికాగానే హాలీవుడ్ నిపుణులతోనే కన్నప్ప తెరకెక్కించే ప్రయత్నం చేస్తాడట. మొత్తానికి కన్నప్ప సినిమా గురించి ఇంకా ఆశలు పెట్టుకోవచ్చన్నమాట.

is Tanikella bharani say no to Manchu vishnu?:

Manchu Vishnu about Kannappa Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ