జయం సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఆఫ్ టాలీవుడ్ జాబితాలో కొనసాగాడు. కానీ సడెన్ గా నితిన్ ఇంట పెళ్ళి సందడి మొదలైంది. తను ఏడేళ్ళుగా ప్రేమిస్తున్న షాలిని అనే అమ్మాయిని ఏప్రిల్ 16 న వివాహం చేసుకుని ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అయితే హైదరాబాద్ లో నిశ్చితార్థం చేసుకున్న నితిన్ పెళ్ళి దుబాయ్ లో చేసుకుందామని ప్లాన్ చేశాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పెళ్ళి దుబాయ్ లో జరగకపోవచ్చు అని తెలుస్తుంది.
ప్రజలందర్నీ కరోనా గడగడలాడిస్తున్న ఈ టైమ్ లో మిడిల్ ఈస్ట్ దేశమైన దుబాయ్ లో వివాహం చేసుకోవడం కష్టమని భావిస్తున్నారు. ఎందుకంటే దుబాయ్ నుండి వచ్చినవారిలోనే కరోనా లక్షణాలు ఉన్నాయని పుకార్లు చెలరేగుతున్న ఈ సమయంలో దుబాయ్ కి వెళ్ళడం కష్టంగా మారింది. అంతే కాదు పక్క దేశాలు వెళ్దామంటేనే వణికిపోతున్న పరిస్థితిలో వివాహ విందుని ఇక్కడే జరిపించాలని భావిస్తున్నారట.
ప్రస్తుతానికైతే ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి పెళ్ళి ఇక్కడే జరుగుతుందా.. లేదా దుబాయ్ కాకుండా మరొక ప్లేస్ లో అయినా జరిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే పెళ్ళి ఎక్కడ జరిగినా ఏప్రిల్ 21వ తేదీన విందు మాత్రం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఇస్తారట.