మెగా ఫ్యామిలీ నుండి హీరోలు పుట్టలు పుట్టలుగా పుడుతూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుండి హీరో వస్తున్నాడు అంటే మెగా ఫ్యాన్స్ చేసే సందడే వేరు. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటోళ్ళు వెండితెరకు పరిచయం అయినప్పుడు జరిగిన హంగామా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లాంటోళ్ళు తెరకు పరిచయం అయినప్పుడు జరగలేదు. లో బడ్జెట్ మూవీస్ తోనే వారు హీరోగా అరంగేట్రం చేసారు. కానీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్, సుకుమార్ శిష్యుడు డైరెక్షన్ లో ఉప్పెన సినిమాతో భారీ బడ్జెట్ తో మైత్రి మూవీస్ నుండి తెరకు పరిచయం అవుతున్నాడు. ఫస్ట్ లుక్ అప్పుడు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమాకి దేవిశ్రీ ఇచ్చిన మొదటి సాంగ్ మ్యూజిక్ తో సినిమా మీద హైప్ పెరిగింది.
మరి కొత్త హీరో.. అందులోను మెగాస్టార్ కొడుకు కాదు... మేనల్లుడు. అయినా ఈ సినిమాకి మైత్రి మూవీస్ 20 కోట్ల బడ్జెట్ పెట్టింది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. సుకుమార్ మీద నమ్మకం, దేవిశ్రీ మీద భరోసా వేసి మైత్రి వారు వైష్ణవ తేజ్ సినిమా ఉప్పెన మీద ఎడా పెడా ఖర్చు పెడుతున్నారట. అసలు హీరో, హీరోయిన్ కన్నా ఎక్కువగా విలన్ విజయ్ సేతుపతికే 7 కోట్లు అంటే.. సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర రేంజ్ అర్ధమవుతుంది. అయితే టైటిల్ దగ్గరనుండి సినిమా మీద పాజిటివిటి కనబడడం, లుక్ లోను, మ్యూజిక్ విషయంలోనూ పాజిటివిటి ఉండడంతో.. ఈ సినిమాకి 15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ మిగతా 10 కోట్లు డిజిటల్, శాటిలైట్ హక్కులు కింద వచ్చేస్తాయని ధీమాతో మైత్రి మూవీస్ ఉందట. ఇప్పటికే ఉప్పెనకి బడా ఏరియాల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయని... దిల్ రాజు నైజం రైట్స్ ని 4.5 కోట్లకి కొన్నట్లుగా టాక్ అయితే స్ప్రెడ్ అయ్యింది.