Advertisementt

‘అల..’తో క్రేజ్ వచ్చిందని కోటి అడుగుతుందంట!

Sun 08th Mar 2020 09:54 PM
tabu,bollywood,tollywood,ala vaikunthapurramloo,senior heroine,remuneration  ‘అల..’తో క్రేజ్ వచ్చిందని కోటి అడుగుతుందంట!
Tabu Demands 1 Cr for Tollywood Roles ‘అల..’తో క్రేజ్ వచ్చిందని కోటి అడుగుతుందంట!
Advertisement
Ads by CJ

హీరోయిన్స్‌కి కోటి డిమాండ్ ఉంటే.. క్రేజ్ ఉంటే నిర్మాతలు కూడా వాళ్ళు అడిగింది కాదనకుండా ఇస్తారు. పూజ, రష్మిక లాంటోళ్లు డిమాండ్ చేసి మరీ పారితోషకాలు పట్టికెళ్ళిపోతున్నారు. మిగతా హీరోయిన్స్ అంతా నిర్మాతలు చెప్పింది తీసుకుని సైలెంట్ గా వెళ్లిపోతున్నారు. కారణం అవకాశాలు ఉంటే చాలు. సంక్రాంతికి విడుదలైన బడా సినిమాల్లో విజయశాంతి, టబు ఇద్దరు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ భామల్లో.. ‘సరిలేరు నీకెవ్వరు’తో విజయశాంతి కేరెక్టర్‌కి వచ్చిన మార్కులు ‘అలా వైకుంఠపురములో’ టబు పాత్రకైతే రాలేదు. విజయశాంతి ఎప్పటిలాగే.. పవర్ ఫుల్ పాత్రలో ఇరగదీసింది.. కానీ టబు సో సో కేరెక్టర్ తోనే సరిపెట్టుకుంది.

అయితే విజయశాంతి మళ్లీ సినిమాలలో నటించేందుకు సుముఖత చూపడం లేదు కానీ.. టబు మాత్రం టాలీవుడ్ లో కెరీర్ కొనసాగించాలని అనుకుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు టబుని అమ్మ, అత్త పాత్రలకు సంప్రదిస్తుంటే టబు నాకు బోలెడంత క్రేజ్ ఉంది అనుకుని దర్శకనిర్మాతలను కోటి డిమాండ్ చేస్తూ బెదరగొడుతుందట. హీరోయిన్స్‌కే అంత ఇవ్వడం లేదు... అమ్మ, అత్త పాత్రలకు కోటి ఇవ్వాలా అని నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారట. కానీ టబు మాత్రం కోటి ఇస్తేనే సినిమా చేస్తా అంటుందట. 

Tabu Demands 1 Cr for Tollywood Roles:

Producers shocks with Tabu Demand 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ