Advertisementt

విజయ్, పూరి సినిమా లేటెస్ట్ అప్డేట్..!

Sun 08th Mar 2020 09:49 PM
vijay deverakonda,puri jagannadh,40 days of shoot,pan india film,charmee  విజయ్, పూరి సినిమా లేటెస్ట్ అప్డేట్..!
Puri Jagan and Vijay Deverakonda Movie Latest Update విజయ్, పూరి సినిమా లేటెస్ట్ అప్డేట్..!
Advertisement
Ads by CJ

40 రోజుల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ సినిమా

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సంచ‌ల‌న క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. అక్క‌డ ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు చంకీ పాండే కుమార్తె అన‌న్యా పాండే నాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ చిత్ర బృందం 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోగా, వాటిలో రెండు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా ఉన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌న్యా పాండే, రోణిత్ రాయ్‌, అలీ త‌దిత‌రుల‌పై ముఖ్య‌మైన స‌న్నివేశాలు తీశారు.

పాన్ ఇండియా ఫిల్మ్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమాని బ‌డ్జెట్ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా భారీ స్థాయిలో పూరి క‌నెక్ట్స్, ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. అత్యంత ఆస‌క్తిక‌రమైన‌ ఈ క్రేజీ కాంబినేష‌న్ సినిమాకు విష్ణుశ‌ర్మ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ఇదివ‌ర‌కు పూరి జ‌గ‌న్నాథ్ ఫిల్మ్ ‘ఇద్ద‌ర‌మ్మాయిల‌తో..’ స‌హా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేసి మంచి పేరు సంపాదించుకున్న కెచ్చా.. స్టంట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ స‌హ నిర్మాణంలో త‌యార‌వుతున్న ఈ యాక్ష‌న్ ఫిల్మ్‌ను పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా క‌లిసి నిర్మిస్తున్నారు.

తారాగ‌ణం:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్యా పాండే, ర‌మ్య‌కృష్ణ‌, రోణిత్ రాయ్‌, విష్ణురెడ్డి, అలీ, మ‌క‌రంద్ దేశ్‌పాండే, గెట‌ప్ శ్రీ‌ను త‌దిత‌రులు.

సాంకేతిక బృందం:

సినిమాటోగ్రాఫ‌ర్‌: విష్ణుశ‌ర్మ‌

ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖీ

ఆర్ట్‌: జానీ షేక్ బాషా

స్టంట్స్‌: కెచ్చా

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

Puri Jagan and Vijay Deverakonda Movie Latest Update:

Vijay Deverakonda, Puri Jagannadh’s Film Completes 40 Days Of Shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ