Advertisementt

వర్మ నిజంగానే మారిపోయాడా...?

Sat 07th Mar 2020 08:20 PM
rgv,disha,ram gopal varma  వర్మ నిజంగానే మారిపోయాడా...?
Ram Gopal Changed..? వర్మ నిజంగానే మారిపోయాడా...?
Advertisement
Ads by CJ

శివ సినిమాతో సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చు అని చూపించి, ఆ తర్వాత క్షణ క్షణం సినిమాతో శ్రీదేవికి ప్రేమలేఖరాసి, బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ కూడా విజయవంతమైన చిత్రాలు తీసి ప్రస్తుతం విజయానికి ఆమడ దూరంలో వివాదాలి అడుగుదూరంలో ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మ నుండి ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నింటిలో ఏదో ఒక వివాదం ఉంటుంది. కంటెంట్ పరంగానే వివాదాస్పదంగా ఉండే చిత్రాలనే తెరకెక్కిస్తుంటాడు.

అయితే సమాజంతో తనకేమీ అవసరం లేదని, సమాజానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతానని, వాక్ స్వాతంత్ర్యాన్ని వాడుకుని కామెంట్స్ చేస్తానని, ఎవరికీ సాయం చేయనని చెప్పుకునే వర్మ అకస్మాత్తుగా మారినట్టు కనబడుతున్నాడు. సాయం చేయడం విషయంలో వర్మకి ఉన్న సిద్ధాంతాన్ని పక్కకి వదిలి ఈ సారి తనే సాయం అడుగుతున్నాడు. అయితే ఈ సాయం కూడా మరొకరికి సాయం చేయడానికే.

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య గురించి అందరికీ తెలిసిందే. దిశ అత్యాచార కేసులో నిందితుడైన చెన్న కేశవులు భార్య రేణుకకి సాయం చేస్తానని గతంలో చెక్ రాసిచ్చిన సంగతి తెలిసిందే. దిశ హత్య జరిగినపుడు గర్భంతో ఉన్న రేణుక నేడు ఆడబిడ్డకి జన్మనిచ్చింది. అయితే రేపిస్ట్ భార్యగా సమాజం చూసే చిన్న చూపు ఆమె మీద పడకుండా ఉండేందుకు విరాళంగా ఎంతో కొంత అమౌంట్ ని ఇవ్వాలని ట్విట్టర్ ద్వారా కోరాడు రామ్ గోపాల్ వర్మ. 

ఇదంతా చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ మారిపోయాడని కొందరు అంటున్నారు. మరి కొందరేమో రామ్ గోపాల్ వర్మ ఏమీ మారలేదని, ఆయన అసలు స్వరూపం అదేనని చెప్తున్నారు. వర్మ మారినా మారకపోయినా ఒక మంచి పనిచేస్తున్న ఆయన్ని తప్పక అభినందించాల్సిందే, మనమూ సాయం చేయాల్సిందే..

Ram Gopal Changed..?:

Ram Gopal varma asking help for to do help 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ