ఇదేంటి.. టైటిల్ చూడగానే.. జూనియర్ ఎన్టీఆర్‌కు.. మెగాస్టార్ చిరంజీవికి పోలికే లేదు కదా.. ఇక సంబంధమేంటి..? అని అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఇదంతా సోషల్ మీడియా.. వెబ్ సైట్లు చెబుతున్న మాటలండోయ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు పుకార్లు షికార్లు చేశాయ్.. మరీ ముఖ్యంగా ఇదిగో కథ.. ఇలాంటి కథ.. ఎన్టీఆర్ పాత్ర ఇలాంటిదే అనే వార్తలు కోకొల్లలుగా వచ్చాయి. వాటి గురించి ఇప్పటి వరకూ ఇటు త్రివిక్రమ్ గానీ.. ‘ఆర్ఆర్ఆర్’లో షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది.
అదేమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి-అల్లు రామలింగయ్య కాంబినేషన్‌లో 1983లో వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమా తరహాలో కథ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో రాజకీయ నాయకుడైన తన మావగారిని కథానాయకుడు ఆటపట్టించడం తరహాలో సినిమా సాగుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా పొలిటికల్ టచ్ ఇస్తున్నాడని అందుకే ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ఎంచుకున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయ్. అక్కడ చిరు అయితే.. ఇక్కడ అల్లుడిగా ఎన్టీఆర్ నటిస్తారని తెలుస్తోంది. అంటే.. ఇదే నిజమైతే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి చిరంజీవికి సంబంధం ఉన్నట్లేగా.
వాస్తవానికి.. త్రివిక్రమ్ సినిమా ఎవరితో అయినా ఇలాంటి పుకార్లు మాత్రమే కామనే. మరీ ముఖ్యంగా ఈయన ప్రతి సినిమాకు పాత చిత్రాలకు ఎక్కడో ఒక చోట లింకులు కనిపిస్తుంటాయ్. దీంతో మాటల మాంత్రికుడ్ని కాపీ క్యాట్ అని కూడా క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే అందులో భాగంగానే తాజాగా ఇలా పుకార్లు వస్తున్నాయ్. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే.. ఈసారి ఎన్టీఆర్‌ను టూ డిఫరెంట్‌గా చూపించి.. బాక్సాఫీస్‌ను షేక్ చేయాలనే గట్టి ప్రయత్నంలోనే మాటల మాంత్రికుడు ఉన్నాడని మాత్రం తెలుస్తోంది.