అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ తో సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. జులపాల జుట్టు, బూచోడి లాంటి గెడ్డంతో అల్లు అర్జున్ పూర్తి స్థాయి కడప కుర్రాడిగా మారడమే కాదు.. రాయలసీమ భాష కోసం ట్యూషన్ కి వెళుతున్నాడు. మరి త్వరలోనే సుక్కుతో కలిసి సెట్స్ మీదకెళ్ళబోతున్న అల్లు అర్జున్ ఈమధ్యన వేసిన ప్లాన్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయి. అందులో అల వైకుంఠపురములో సాంగ్స్ స్ట్రాటజీ ఒకటి. రెండు.. సినిమా విడుదల టైమింగ్. మహేష్ సరిలేరు నీకెవ్వరుతో మనకి పోటీ ఎందుకులే అని త్రివిక్రమ్ అంటే కాదు మన సినిమాకి దమ్ముంది అని మహేష్ తో పోటీపడేలా చేసాడు. బన్నీ అనుకున్నట్టుగానే ఆ సినిమా మహేష్ సినిమాని వెనక్కి నెట్టేసింది. సాంగ్స్ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది.
తాజాగా సుకుమర్ సినిమా విషయంలోనూ అల్లు అర్జున్ ప్లాన్ చేసినట్టుగా వర్కౌట్ అవుతుందా.. లేదా.. అనేది ప్రస్తుతం సస్పెన్స్. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి సుక్కుతో కలిసి బాక్సాఫీసు దాడి చేద్దామనుకుంటే.. రాజమౌళి RRR ని దింపుతున్నాడు. దానితో మనకెందుకులే పోటీ అసలే పాన్ ఇండియా ఫిలిం అనుకున్న అల్లు అర్జున్ అందరిలో తన సినిమా వాయిదాతో సరిపెట్టకుండా ప్రీ పోన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట. ఎలాగూ దసరా నుండి డిసెంబర్ వరకు పెద్ద సినిమాలేమి విడుదల కావడం లేదు. చిరు ఆచార్య, ప్రభాస్ జాన్ ఇవన్నీ RRR తో నెక్స్ట్ సమ్మర్ కి వెళ్లిపోయాయి. సో డిసెంబర్ నెలాఖరులో సుక్కుతో చేసే సినిమాని విడుదల చేస్తే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అని బన్నీ ఆలోచన కానీ.. సుక్కుతో సినిమా అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. సుకుమార్ సినిమాని చెక్కి చెక్కి చెక్కుతూనే ఉంటాడు కానీ తెమలనీయడు. మరి ఈసారి సుక్కు విషయంలో బన్నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.