పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యనే రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. ప్రపంచంలోనే టాప్ ట్రెండింగ్ లొ మొదటి రెండు స్థానాల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నిలవడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది.
అయితే ఈ లుక్ మీద ఎన్ని ప్రశంసలు వచ్చాయో అన్ని విమర్శలు కూడా వచ్చాయి. సినిమా కథా పరంగా ఆడవాళ్ళ గురించైతే పోస్టర్ మీద వాళ్ళ ఫోటోలు ఇవ్వకపోవడంతో ఒక వర్గం వారు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వారి అహం చల్లార్చడానికా అన్నట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8న వకీల్ సాబ్ నుండి మరో అప్డేట్ రాబోతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి పాటని రిలీజ్ చేయబోతున్నారు.
దానికి సంబంధించిన అప్డేట్ ని ఈరోజు వదిలింది చిత్ర బృందం. మగువ మగువ అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించగా సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించడం జరిగింది. ఈ మధ్య థమన్ పాటలు సినిమాకి ఎంత ప్లస్ అవుతున్నాయో తెలిసిందే. ఈ పాట కూడా వకీల్ సాబ్ కి చాలా ప్లస్ కానున్నట్లు అనిపిస్తుంది. మరి మహిళల గురించి ఉన్న ఈ పాట విన్నాక అయినా ఆ వర్గం వారు సంతృప్తి చెందుతారా లేదా చూడాలి.