Advertisementt

పవన్, క్రిష్ ఫిల్మ్ మెయిన్ కాన్సెఫ్ట్ ఇదేనా?

Fri 06th Mar 2020 08:52 PM
kohinoor diamond,pawan kalyan,krish,main concept  పవన్, క్రిష్ ఫిల్మ్ మెయిన్ కాన్సెఫ్ట్ ఇదేనా?
This is the Main Concept to Pawan and Krish Film పవన్, క్రిష్ ఫిల్మ్ మెయిన్ కాన్సెఫ్ట్ ఇదేనా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ టైటిల్ వకీల్ సాబ్ తో పాటుగా పవన్ లుక్ కూడా బయటికొచ్చేసింది. పవన్ ఫ్యాన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ కాస్తో కూస్తో తగ్గింది. రెండేళ్లుగా వెండితెరకు దూరమైన పవన్ మళ్లీ స్క్రీన్ మీద ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటీకి వకీల్ సాబ్ లుక్ తో తెరపడింది. ఇక క్రిష్ తో పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే క్రిష్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో పవన్ కళ్యాణ్ తో చాలా సీన్స్ షూట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ దొంగగా కనబడతాడని... ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థతో ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది అనే టాక్ ఉంది.

ఆ కాలంనాటి సాంఘిక‌, ఆర్థిక, రాజ‌కీయ ప‌రిస్థితుల్ని తెర‌పై చూపించ‌బోతున్నారని, అలాగే పవన్ కళ్యాణ్ దొంగగా.. కోహినూర్ వజ్రం కోసం ట్రై చేస్తాడని అంటున్నారు. సినిమా కథ మొత్తం కోహినూర్ డైమండ్ చుట్టూతానే తిరుగుతుంది అంటే.. దొంగగా పవన్ కళ్యాణ్ కూడా కోహినూర్ వజ్రాన్ని కొట్టెయ్యడానికి ప్లాన్ చేస్తాడేమో అంటున్నారు. ఇక పవన్‌తో జోడి కోసం ఇప్పటికే కీర్తి సురేష్, ప్రగ్యా జైస్వాల్ పేర్లు వినబడుతుండగా.. మరో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ పేరు ప్రచారంలోకొచ్చింది. ఇంకా ఏ ఒక్క హీరోయిన్ క్రిష్ ఫైనల్ చెయ్యలేదు కానీ... ఈసినిమా టైటిల్‌గా విరూపాక్ష అని మాత్రం బాగా ప్రచారంలోకొచ్చింది.

This is the Main Concept to Pawan and Krish Film:

kohinoor diamond Concept to Pawan and Krish Film