Advertisementt

బర్త్‌డే స్పెషల్: కిశోర్ తిరుమ‌లతో శర్వానంద్

Fri 06th Mar 2020 07:19 PM
birthday special,sharwanand,kishore tirumala,movie announcement  బర్త్‌డే స్పెషల్: కిశోర్ తిరుమ‌లతో శర్వానంద్
Sharwanand New Film Announced బర్త్‌డే స్పెషల్: కిశోర్ తిరుమ‌లతో శర్వానంద్
Advertisement
Ads by CJ

శర్వానంద్‌, కిశోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌తో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ చిత్రం

శ‌ర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సుధాక‌ర్ చెరుకూరి స‌న్నాహాలు చేస్తున్నారు. శ‌ర్వానంద్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఆయ‌న ఈ కొత్త సినిమాని ప్ర‌క‌టించారు. భిన్న క‌థ‌ల‌తో సినిమాలు చేస్తూ చిత్ర‌సీమ‌లో త‌న‌దైన ముద్ర వేసిన శ‌ర్వానంద్ ఇప్పుడు కిశోర్ తిరుమ‌ల‌తో ఒక పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైన‌ర్ చేసేందుకు అంగీక‌రించారు.

శ‌ర్వానంద్‌తో తొలిసారిగా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ప్ర‌స్తుతం ఆయ‌న రానా హీరోగా విరాట‌ప‌ర్వం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర్వానంద్‌తో ఆయ‌న నిర్మించ త‌ల‌పెట్టిన సినిమా నిర్మాత‌గా ఆయ‌న‌కు మూడ‌వ‌ది. ఎప్పుడు ఈ సినిమా మొద‌ల‌య్యేదీ, తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Sharwanand New Film Announced:

Birthday Special: Sharwanand Movie with Kishore Tirumala

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ