Advertisementt

రాజశేఖర్ ‘అర్జున’పై కరోనా ఎఫెక్ట్!

Fri 06th Mar 2020 07:10 PM
rajasekhar,arjuna movie,corona effect,postponed  రాజశేఖర్ ‘అర్జున’పై కరోనా ఎఫెక్ట్!
Rajasekhar Arjuna Movie Again Postponed రాజశేఖర్ ‘అర్జున’పై కరోనా ఎఫెక్ట్!
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా 13వ తేదీకి వాయిదాపడిన అర్జున విడుదల

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 6న కాకుండా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. రాజశేఖర్ సరసన అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ట్రైలర్స్ ఇటీవల విడుదలై... ట్రెండింగ్‌లో ఉన్నాయని వారు చెప్పారు. ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారని అన్నారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తాయి అని అన్నారు.

Rajasekhar Arjuna Movie Again Postponed:

Corona Effect on Rajasekhar Arjuna Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ