Advertisementt

‘ఒరేయ్‌ బుజ్జిగా...’ టీజ‌ర్ రెస్పాన్స్‌ అదిరిందంట!

Fri 06th Mar 2020 02:00 PM
raj tarun,malavika nayar,orey bujjiga,teaser,release  ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ టీజ‌ర్ రెస్పాన్స్‌ అదిరిందంట!
Tremendous Response to Orey Bujjiga Teaser ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ టీజ‌ర్ రెస్పాన్స్‌ అదిరిందంట!
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌లచేసిన ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...’  అనూప్‌ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడుద‌లైన ‘కురిసెన.. కురిసెన..’ పాట‌కి ట్రెమండ‌స్ రెస్పాన్ వ‌స్తోంది. మార్చి4(బుద‌వారం) సాయంత్రం 5.04నిమిషాల‌కు ఈ చిత్ర టీజ‌ర్ ను ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ వ‌న్ మిలియ‌న్ కి పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ‘‘మా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ టీజ‌ర్‌ను విడుద‌ల‌ చేసిన హ‌రీష్ శంక‌ర్ గారికి ధ‌న్య‌వాదాలు. ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ కి పైగా వ్యూస్  ద‌క్కించుకోవ‌డం సంతోషంగా ఉంది. మా ద‌ర్శ‌కుడు విజయ్‌కుమార్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునేలా మంచి విజ‌న్ తో ఈ చిత్రాన్నితెర‌కెక్కించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.  యూత్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ మా బేనర్‌లో డెఫినెట్‌గా మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది’’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Tremendous Response to Orey Bujjiga Teaser:

Orey Bujjiga Teaser Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ