అల్లు అర్జున్ ఎంత బెస్ట్ డాన్సరో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ డాన్స్‌లకు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. బన్నీ డాన్సింగ్ స్టయిల్ హీరోయిన్స్ కి బాగా నచ్చుతుంది. యంగ్ హీరోలు అల్లు అర్జున్ డాన్స్ స్టయిల్ గురించి గొప్పగా చెబుతారు. ఈమధ్యన కోలీవుడ్ హీరో విజయ్ డాన్స్ కి ఎన్టీఆర్ డాన్స్ కి పోలిక పెడుతూ అభిమానులు సోషల్ మీడియాలో వీరంగం సృష్టించారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ హీరో అల్లు అర్జున్ డాన్స్‌కి ఫిదా అయ్యా అంటున్నాడు. అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టమని.. అసలు అల్లు అర్జున్ ఇంత మంచిగా డాన్స్ చెయ్యడానికి ఆయన డైట్ సీక్రెట్ ఏమిటో కనుక్కోవాలి అంటూ చెబుతున్నాడు. బాలీవుడ్‌లో కండల వీరుడు హృతిక్ రోషన్‌కి అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టమంట. ఈ మధ్య కాలంలో ఒక్క సౌత్ సినిమా కూడా చూడలేకపోయా అని.. సౌత్ సినిమాల్లో టెక్నాలజీ వాడే తీరు సూపర్ అని చెబుతున్నాడు హృతిక్ రోషన్. ఇక తనకి స్టోరీ నేరేషన్ చెయ్యడానికి వచ్చే దర్శకులకు కథ విన్న 30 సెకెన్స్ లోనే ఓకె చెబుతా అని.. 30 సెకన్స్ లో నేను ఓకె చెప్పకపోతే ఆ సినిమా నేను చెయ్యనని అర్ధమట. తాను చేసిన సినిమాలన్నీ అలా 30 సెకన్స్ లో ఓకే చేసిన సినిమాలే అంటున్నాడు.
ఇక సౌత్ స్టార్స్‌లో అల్లు అర్జున్ డాన్స్ బావుంటుంది అని.. డాన్స్ చెయ్యడానికి చాలా సాధన అవసరమని, డాన్స్ ని ఆస్వాదిస్తూ చెయ్యాలని, డాన్స్ ఎంజాయ్ చేస్తూ చేస్తే ఫేస్ ఎక్సప్రెషన్స్ బావుంటాయని అంటున్నాడు. అల్లు అర్జున్ డాన్స్ స్ఫూర్తిదాయకం, ఎనేర్జిటిక్, స్ట్రాంగ్ అంటూ అల్లు అర్జున్ డాన్స్‌పై కితాబిచ్చేశాడు.