మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అరవింద సమేత, అల వైకుంఠపురములో వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడ్డాయి. అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డుని కూడా క్రియేట్ చేసింది. అయితే త్రివిక్రమ్ ఏ సినిమా చేసినా ఎన్ని ప్రశంసలు వస్తాయో అన్ని విమర్శలు కూడా వస్తుంటాయి. తన సినిమాలకి ఆధారం మన పాత సినిమాలని చెప్తూ ఉంటారు.
దీనికి ఉదాహరణగా అ ఆ సినిమాని చూపిస్తారు. సూపర్ స్టార్ క్రిష్ణ, విజయనిర్మల జంటగా నటించిన మీనా సినిమా ఆధార్ంగానే అ ఆ తెరకెక్కిందని చెప్తుంటారు. అయితే ఈ విషయంలో త్రివిక్రమ్ కూడా అది నిజమేనని, వారి పర్మిషన్ తీసుకున్న తర్వాతే అలా చేసానని చెప్పుకొచ్చాడు. అయినా కూడా విమర్శలు తగ్గలేదు. మొన్న వచ్చిన అల వైకుంఠపురములో సినిమా పాత ఇంటిగుట్టు సినిమాలాగా ఉందని అన్నారు.
ఇప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్న సినిమాకి కూడా ఏదో ఒక ఇన్సిపిరేషన్ ఉంటుందని చెప్పడమే కాదు చిరంజీవి హీరోగా చేసిన మంత్రిగారి వియ్యంకుడు సినిమా మూలకథ ఆధారంగానే ఈ కథ తెరకెక్కబోతుందని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలిసినప్పటి నుండి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. మరి ఈ పుకార్లపై త్రివిక్రమ్ స్పందిస్తాడా లేదా మనకెందుకులే అని వదిలేస్తాడా చూడాలి.