ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలితో భారీగా రేంజ్, క్రేజ్ పెంచుకున్న ప్రభాస్ డిమాండ్ కూడా అదే లెక్కలో పెరిగింది. మొన్నటికి మొన్న సాహో సినిమా కోసం ప్రభాస్ భారీ పారితోషకం ఫ్రెండ్స్ అయిన యువీ క్రియేషన్స్ నుండి అందుకున్నాడనే న్యూస్ ఉంది. తాజాగా ప్రభాస్ చెయ్యబోయే రాధాకృష్ణ మూవీ కోసం భారీ పారితోషకమే అందుకోబోతున్నాడని.. ప్రభాస్‌కి హిట్స్ ప్లాప్స్‌తో పని లేదని... పారితోషకంతో పాటుగా.. లాభాలొస్తే వాటా ఇవ్వాల్సిందే అంటున్నారు. తాజాగా ప్రభాస్ వైజయంతి మూవీస్‌లో నాగ్ అశ్విన్ తో చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం కోసం కూడా భారీగా అందుకోబోతున్నాడట.
సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ప్రభాస్ సినిమా ఉండబోతుందని.. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసేలా సినిమాను తీస్తానని నాగ్ అశ్విన్ చెబుతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ప్రభాస్‌కి వైజయంతి వారు భారీగానే ఇస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం - నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు ప్రభాస్ ఏకంగా 70 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడని... అసలు సినిమా హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా.. అనేది ప్రభాస్‌కు సంబంధం లేని విషయమని.. సినిమా పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రభాస్ కి 70 కోట్ల పారితోషకం ఇవ్వాల్సిందే అని చెప్పడమే కాదు.. దానికి సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తయ్యిందనే న్యూస్ నడుస్తుంది.
మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి భారీగా లాభాలొస్తే మాత్రం లాభాల్లో వాటా కూడా ప్రభాస్ మాట్లాడిపెట్టుకున్నాడనే టాక్ కూడా మొదలయ్యింది. మరి ఈ రేంజ్ క్రేజ్, డిమాండ్ ప్రభాస్ ఒక్కడికే సొంతమేమో కదా.