టైటిల్ చూడగానే.. నిన్న మొన్నటి వరకూ సినిమా కోసం అంతలా పోట్లాడుకొని.. మహేశ్‌ను బన్నీ ఇప్పుడంతలా ఎందుకు బతిమలాడుతున్నాడు..? అనే సందేహం కలుగుతోంది కదూ..? అవును మీరు వింటున్నది నిజమే.. సంక్రాంతి రేసులో పందెం కోళ్లలా కొట్లాడుకున్నా బన్నీ-మహేశ్.. ఇదంతా సినిమాల వరకే.. రియల్ లైఫ్‌లో మాత్రం మామూలుగానే ఉంటారన్నది తెలిసిందే. ఇంతకీ మహేశ్‌ను బన్నీ ఏ విషయంలో ఇంతగా ప్లీజ్.. ప్లీజ్ అంటూ బతిమలాడుతున్నాడు..? బన్నీకి అంత అవసరం ఏమొచ్చిందబ్బా..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని.. ప్లాష్ బ్యాక్‌లో అనగా.. చిరు చిన్నప్పుడు ఉండే పాత్రలో చెర్రీ కనిపించి అలరిస్తాడని వార్తలు వచ్చాయ్. అయితే యంగ్ చిరుగా చెర్రీ కాదు బన్నీ అని కూడా ఆ మధ్య వార్తలు గుప్పుమన్నాయ్.. అంతేకాదు.. చిరు సినిమా కావడంతో అస్సలు వదులుకోకూడదని అనుకున్న బన్నీ.. అవసరమైతే సుక్కు సినిమా కొన్నిరోజులు పక్కనెట్టాలని కూడా భావించాడట. అయితే అదృష్టం తలుపు తట్టినట్లే తట్టి చేజారిపోయిందట. అది కాస్త సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంపౌండ్‌లో వాలిపోయిందట.
ప్లీజ్ మహేశ్.. అవసరమైతే..!
మెగాస్టార్ సినిమాలోకి సూపర్ స్టార్‌ను తీసుకుంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయ్. అన్నీ అయిపోయాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని కూడా వార్తలు వచ్చేశాయ్. ఈ క్రమంలో మహేశ్‌ను బన్నీ బతిమలాడుతున్నాడట. ‘ప్లీజ్.. ప్లీజ్ మహేశ్.. ఈ ఒక్కటీ నాకు వదిలెయ్.. మామయ్య సినిమాలో ఒక్కసారి నటిస్తా’ అని బతిమలాడుతున్నాడని టాక్. బన్నీనే స్వయంగా మహేశ్‌ను సంప్రదించాడట. చిరంజీవితో నటించాలన్నది తన డ్రీమ్ అని.. ప్లీజ్ ఈ ఒక్కటి వదిలేయమని చెప్పాడట. అంతేకాదు.. ఇదే విషయం చెర్రీతో కూడా చెప్పాడట. అవసరమైతే తన తండ్రి అల్లు అరవింద్‌ను కూడా రంగంలోకి దింపాలని భావిస్తున్నాడట. ఇన్ని రెకమెండేషన్ల మధ్య కొరటాల ఫైనల్‌గా ఎవర్ని ఫైనల్ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పే మరి. ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.