కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ఏకంగా ఆ దేశాన్ని దాటి ప్రపంచం నలుమూలలా దాదాపు వ్యాపించేసింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకడంతో ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ వైరస్ అసలు ఎలా వస్తోంది..? దేని వల్ల వస్తోంది..? దీనికి మందేంటి..? అనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. ఈ వైరస్ సోకితే ఏకంగా మరణమే తప్ప మరో మార్గం లేదు. ఇలాంటి తరుణంలో పలువురు సెలబ్రిటీలు తగు జాగ్రత్తలు చెబుతూ వారి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు విషయాలు షేర్ చేసుకుంటున్నారు. తాజాగా.. తెలుగు టాప్ యాంకర్.. టాలీవుడ్‌ను తన యాంకరింగ్‌తో దున్నేస్తున్న సుమ స్పందించి.. తనదైన శైలిలో కొన్ని కొన్ని చిట్కాలకు షేర్ చేసుకుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇలా చేయండి..!
కరోనా సోకకుండా.. సోకిన తర్వాత ఏమేం చేయాలి..? కరోనా వస్తే లక్షణాలు ఎలా ఉంటాయనేది.. సుమ ఓ వీడియో రూపంలో పంచుకుంది. మరుగున పడేసిన మన సంస్కృతి, సంప్రదాయ పద్ధతులను మళ్లీ కచ్చితంగా పాటిస్తే ఈ వైరస్ సోకకుండా ఉండే అవకాశం ఉంది. ఈ వైరస్‌కు ఉన్న లక్షణాలు ముక్కు కారడం (జలుబు), తుమ్ములు, జ్వరం, గొంతునొప్పి, చాతిలో నొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం, రెండు మూడు రోజుల తర్వాత పొడిదగ్గు, స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరోచనాలు. పైన చెప్పిన ఇవన్నీ ఉంటే కచ్చితంగా వైరస్ సోకిందని కాదు. ఒక వేళ ఈ లక్షణాలు ఉంటే వెళ్లి డాక్టర్‌ను సంప్రదించండి. భయపడాల్సింది ఏమీ లేదు..’ అని మన ఆరోగ్యం.. మన చేతిలో ఉందన్నట్లు సుమ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
ఇంకొందరు ఇలా..!
కాగా.. సెలబ్రిటీలు చాలా వరకు ఈ కరోనాపై పలు విషయాలను పంచుకుంటున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించాడు. వేడి నీళ్లలో నిమ్మకాయ రసం పిండుకుని తాగితే కరోనా వైరస్ మన దరిదాపుల్లోకి కూడా రాదట అని చెప్పాడు. మరోవైపు.. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. మనం ఎవరినైనా పలకరించేటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ ఇవ్వడం లాంటివి చేస్తుంటామని.. అలాంటివి ఇకపై చేయొద్దని సలహా ఇచ్చాడు. ఇలా పలువురు సినీ ప్రముఖులు సలహాలు, సూచనలు ఇచ్చారు. వీరందరిలో మన సుమక్కే హైలైట్‌గా నిలిచింది.