జర్నలిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బాలు అడుసుమిల్లి .. తాజాగా దర్శకుడి అవతారమెత్తాడు. దర్శకుడిగా తన తొలి సినిమా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నలుగురు హీరోయిన్స్‌తో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ కనబడుతుంది. తాజాగా బాలు అడుసుమిల్లి కూడా తనకి మొదటినుండి డైరెక్షన్ అంటే ఇష్టమని.. కానీ మొదట్లో మీడియాలోకి వెళ్లాల్సి వచ్చింది అని.. అయితే ఓ మంచి కథతో ఇప్పుడు దర్శకుడిగా మారాను అని చెబుతున్నాడు. తనలాంటి కొత్త దర్శకులతో ఏ హీరో సినిమా చెయ్యడు కాబట్టి.. ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతో హీరోయిన్స్ తో సినిమా చేశా అని చెబుతున్నాడు.
ఈ సినిమా నలుగురు అమ్మాయిలు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారో అనేది నా సినిమాలో చూపించా అని, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉంటుంది అని చెబుతున్నాడు. సినిమా మొత్తం అమ్మాయిల చుట్టే తిరుగుతుంది అని.. అమ్మాయిల నేపథ్యంలోనే కథని రాసుకున్నా అని చెబుతున్నాడు. మరి ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా పోస్టర్స్, ఫొటోస్ అన్ని ఆకట్టుకునేలా ఉండడంతో.. ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా హిట్ అయితే గనక దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తా అంటున్నాడు ఈ డెబ్యూ డైరెక్టర్.