Advertisementt

‘అహం బ్రహ్మాస్మి’ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Thu 05th Mar 2020 07:13 AM
aham brahmasmi,powerful first look,manchu manoj,pan india film  ‘అహం బ్రహ్మాస్మి’ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్
Manchu Manoj Pan India Film Aham Brahmasmi First Look Released ‘అహం బ్రహ్మాస్మి’ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘అహం బ్రహ్మాస్మి’ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల

హీరో మంచు మనోజ్ అదిరిపోయే రీతిలో వెండితెరపై కనిపించేందుకు మళ్లీ వస్తున్నారు. ఇటీవలే ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక విలక్షణ పవర్ఫుల్ స్టోరీతో రూపొందే ఈ సినిమా మార్చి 6న గ్రాండ్‌గా లాంచ్ కానున్నది. శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్ట్ చేసే ‘అహం బ్రహ్మాస్మి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మాణమవుతోంది. బుధవారం ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ పోస్టర్లో శివభక్తుని తరహాలో మంచు మనోజ్ మూడు అడ్డ విభూది నామాలు, వాటి మధ్యలో నిలువు తిలకం దిద్దుకొని కనిపిస్తున్నారు. ‘వాన్ డైక్’ తరహా గడ్డం, పొడవుగా పెంచిన మీసకట్టుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. పోస్టర్లో మనోజ్ మూడు రకాల హావభావాలు.. హాస్యం, రౌద్రం, శాంతం.. ప్రదర్శిస్తున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ కు అద్దం పట్టే విధంగా ఆ లుక్స్ ఉన్నాయి. టైటిల్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఒక భిన్న థీమ్‌తో ఉత్తేజభరితంగా కనిపిస్తున్న ఈ పోస్టర్, సినిమాపై అమితాసక్తిని రేకెత్తిస్తోందనడంలో సందేహమే లేదు. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ పై మంచు మనోజ్, నిర్మలాదేవి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తారాగణం ఎంపిక జరుగుతోంది.

 

సాంకేతిక బృందం:

అడిషనల్ డైలాగ్స్: దివ్య నారాయణన్, కల్యాణ్ చక్రవర్తి

పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్

సంగీతం: అచ్చు రాజమణి, రమేష్ తమిళమణి

సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి

ఎడిటింగ్: తమ్మిరాజు

ఆర్ట్: వివేక్ ఎ.ఎం.

స్టంట్స్: పీటర్ హేన్స్

పీఆర్వో: వంశీ-శేఖర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ చల్లగుళ్ల

నిర్మాతలు: నిర్మలాదేవి మంచు, మనోజ్ కుమార్ మంచు

స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీకాంత్ ఎన్. రెడ్డి.

Manchu Manoj Pan India Film Aham Brahmasmi First Look Released:

Aham Brahmasmi Powerful First Look Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ