ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా గజగజ వణికిస్తోందన్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు చైనా సహా ఇతర దేశాలకే పరిమితమైన ఈ వైరస్ హైదరాబాద్ ని కూడా తాకింది. హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఈ వైరస్ సోకిందని కన్ఫర్మ్ అయింది. దీంతో సదరు సాఫ్ట్ వేర్ కంపెనీ తమ ఉద్యోగులందరికీ కొన్ని రోజులు సెలవులని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా రెండువేల మందికి పైగా ప్రాణాల్ని బలితీసుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పనులన్నీ ఆగిపోయినా పర్లేదని సేఫ్టీ ప్లేసెస్ కి వెళ్ళిపోతున్నారు. అయితే దీనికి భిన్నంగా ప్రభాస్ మాత్రం యూరప్ వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
రాధాక్రిష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా కోసం యూవీ క్రియేషన్స్ తో కలిసి ప్రభాస్ యూరప్ కి వెళ్ళడం అందరికీ షాక్ ని ఇచ్చింది. అసలే అక్కడ రెండు వందల మందికి పైగా వైరస్ సోకినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభాస్ యూరప్ కి వెళ్లడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. చాలా సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ కరోనా కారణంగా క్యాన్సిల్ అవుతుంటే ప్రభాస్ మాత్రం ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ప్రభాస్ యూరప్ వెళ్లాడని తెలిసినప్పటి నుండి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని అయినా సరే తిరిగి వచ్చేయాలని, కావాలంటే మళ్ళీ ఇంకెపుడైనా షూటింగ్ పెట్టుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి ప్రభాస్ అభిమానుల మాటలు విని తిరిగి వస్తాడా లేదా షూటింగ్ కంప్లీట్ చేసుకునే వస్తాడా అన్నది చూడాలి.