కుమారి 21 ఎఫ్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి కుర్రకారు గుండెల్లో మత్తు జల్లిన హెబ్బా ప్రస్తుతం హీరోయిన్ గా ఆఫర్లు లేక అవస్థలు పడుతోంది. ఆ సినిమాలో రాజ్ తరుణ్, హెబ్బాల కెమిస్ట్రీ బాగా కుదిరి హెబ్బాకి మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రేజ్ ని హెబ్బా సరిగ్గా వాడుకోలేకపోయిందనే చెప్పాలి. అందుకే ఆ సినిమా తర్వాత తనకి ఒక్క హిట్టు కూడా రాలేదు. హీరోయిన్ గా ఆఫర్లు వచ్చినా అవేమీ పెద్దగా గుర్తింపు కూడా తీసుకురాలేకపోయాయి. దాంతో చాలా రోజుల వరకు హెబ్బా తెర మీద కనిపించలేదు. కానీ సడెన్ గా ఆమె భీష్మ సినిమాలో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది.
చాలా చిన్నపాటి వ్యాంప్ పాత్రలో గ్లామరస్ గా కనిపించి అందరి కళ్ళు తన మీద పడేలా చేసుకుంది. భీష్మ సినిమా రిలీజ్ కి ముందు సినిమాలో హెబ్బా ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అలాంటిది సినిమా విడుదల అయ్యాక తాను చేసిన చిన్న పాత్ర గురించి కూడా మాట్లాడుకుంటున్నారంటే కారణం ఆమె గ్లామరే.. అయితే భీష్మ సినిమాలో చేసిన క్యారెక్టర్ వల్ల తనకి మరో సినిమాలో మంచి ఆఫర్ వచ్చింది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో హెబ్బా రామ్ తో స్టెప్పులు వేయనుంది. మరి ఈ స్పెషల్ సాంగ్ వల్ల తనకి హీరోయిన్ గా ఆఫర్లు వస్తాయా లేవా చూడాలి.