కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్ర టైటిల్‌ను గ్రాండ్‌గా రివీల్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ చిరు మాత్రం ఓ పిట్ట కథ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టైటిల్‌ను సైలెంట్ గా రివీల్ చేసి షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి పొరపాటున టంగ్ స్లిప్ అయ్యి ఈ టైటిల్‌ను ఆచార్య అని రివీల్ చేసాడని చాలా మంది భావించారు. కానీ కాదని.. చిరు - కొరటాల - మేకర్స్ చర్చల తర్వాతే ఈ ఆచార్య టైటిల్ ని చిరు రివీల్ చెయ్యడం జరిగింది అంటూ ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని టైటిల్స్ భారీ వివాదాలకు దారితీశాయి. కొంతమంది చిత్రనిర్మాతలు చివరి నిమిషంలో అనుకున్న టైటిల్ మార్చవలసి వచ్చింది. ఫ్యాన్స్ మెచ్చే ఆసక్తికరమైన పేర్లను టైటిల్స్‌గా నమోదు చేసినప్పటికీ చివరి నిమిషంలో వాటిని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అందుకే చిరు - కొరటాల కూడా ఆచార్య చిత్ర టైటిల్‌ను రివీల్ చేయడం ద్వారా అన్ని వివాదాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవి ఆచార్య టైటిల్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కథగా ఎండోమెంట్స్ విభాగంలో జరిగిన అవకతవకలను బహిర్గతం చెయ్యడమే ఆచార్య పని అంటూ ఇప్పటికే లీకులు బయటపడ్డాయి. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లోని మూడు రాజధానులకు మద్దతు ఇవ్వగా, తమ్ముడు పవన్ కళ్యాణ్ మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి చాలామంది చిరంజీవి పేరుని బ్లేమ్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ చిరు సినిమా మీద పడకూడదని చిరంజీవి ఆచార్య చిత్ర టైటిల్‌ను విడుదల తేదీకి చాలా ముందు వెల్లడించడం జరిగింది అని అటు టైటిల్ పరంగాను, ఇటు వివాదాల పరంగాను చిరు - కొరటాల డెసిషన్ కరెక్ట్ అంటున్నారు.