Advertisementt

రెజీనా మళ్ళీనా రిస్కేమో ఆలోచించు..?

Tue 03rd Mar 2020 09:51 PM
regina,nenena,nene naa first look  రెజీనా మళ్ళీనా రిస్కేమో ఆలోచించు..?
Regina Nene naa first look released రెజీనా మళ్ళీనా రిస్కేమో ఆలోచించు..?
Advertisement
Ads by CJ

రెజీనా కేసాండ్రా చాలా రోజుల నుండి తెలుగులో మంచి హిట్ కోసం ప్రయత్నిస్తుంది. హీరోయిన్ గా అవకాశాలు రాని సమయంలో అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు లో కీలక పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రెజీనా మళ్ళీ నేనే నా అనే సినిమాలో నటిస్తుంది.కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  ఫస్ట్ లుక్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశాడు. ఎవరు సినిమాలాగే ఇది కూడా మరో థ్రిల్లర్ లాగే కనిపిస్తుంది.

ఈ పోస్టర్ లో రెజీనా లుక్ చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. పీరియాడిక్ డ్రామాగ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనాతో పాటు వెన్నెల కిషోర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఎవరు చిత్రం తర్వాత రెజీనా చేస్తున్న ఈ చిత్రం కూడా సస్పెన్స్ జోనర్ చెందిందే కావడంతో రెజీనాకి మైనస్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎవరు సినిమాలో హీరోగా అడవి శేష్ ఉన్నప్పటికీ కథని నడిపించింది మాత్రం రెజీనానే అని చెప్పాలి.

అంతటి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో చేసినా కూడా తనకి హీరోయిన్ గా సినిమాలు రాలేదు. అదీ గాక బ్యాక్ టు బ్యాక్ సస్పెన్స్ జోనర్ లో సినిమాలు చేయడం వల్ల నిర్మాతలు మెయిన్ హీరోయిన్ గా సినిమాలు చేయించడానికి జంకుతారు. ఈ విషయం రెజీనాకి కూడా తెలిసే ఉంటుంది. కానీ అవకాశాలు లేని టైమ్ లో తన దగ్గరికి వచ్చిన దాన్ని ఎందుకు వదులుకోవడం కరెక్ట్ కాదని భావించి ఉంటుందేమో అని అనుకుంటున్నారు. ఏది ఏమైతేనేం నేనే నా సినిమాతోనైనా తన కెరీర్ మలుపు తిరిగితే బావుంటుంది.

Regina Nene naa first look released:

Regina Nene naa first look released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ