మార్చ్ లో సినిమాల సందడి చాలా తక్కువగా ఉండనుండి. పెద్ద సినిమాలే కాదు మీడియం రేంజ్ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద రిలీజ్ కావడం లేదు. మార్చ్ చివరి వారంలో నాని వి మినహా మిగతావన్నీ చిన్న చిత్రాలే. అయితే మొదటి వారంలో రిలీజ్ అవుతున్న చిత్రాలన్నింటిలోకి ఎక్కువ ఆసక్తి రేపుతున్న చిత్రం పలాస 1978. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత్ హీరోగా నటిస్తున్నాడు.
పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. పలాస మార్కెట్ లో జరిగిన హత్య చుట్టూ తిరిగే కథతో సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. తాజాగా ప్రమోషన్లలో పాల్గొన్న చిత్ర దర్శకుడు ఈ సినిమా తమిళ హిట్ సినిమా అయిన అసురన్ తో పోలుస్తున్నాడు. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కుల వివక్ష గురించి చూపించడం జరిగింది.
పలాస సినిమాలోనూ అటువంటి అంశమే ఉంటుందని చెబుతున్నారు. అసురన్ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా నారప్పగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగులో ఆ సినిమా రీమేక్ అవుతుందని తెలిసి కూడా అసురన్ తో తమ సినిమాకి పోలికలు ఉన్నాయని చెప్పడం సరికాదని అంటున్నారు. మరి ఈ సినిమా నిజంగానే అసురన్ లా ఉందా లేదా అనేది మార్చ్ 6వ తేదీన తెలిసిపోతుంది.