Advertisementt

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సెన్సార్ పూర్తి

Wed 04th Mar 2020 07:20 PM
pradeep,amrutha ayyar,30 rojulalo preminchadam ela,movie,censor,complete,details  ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సెన్సార్ పూర్తి
30 Rojulalo Preminchadam Ela Movie Censor Completed ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సెన్సార్ పూర్తి
Advertisement
Ads by CJ

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సెన్సార్ పూర్తి

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకుడు. అమృత అయ్యర్ నాయిక. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఒక దృశ్యకావ్యంగా ఉందని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇటీవల సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ అయిన ‘నీలి నీలి ఆకాశం’ సంగీత ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్‌లో ఇప్పటికి 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఒక చిన్న సినిమా పాట ఈ స్థాయిలో పాపులర్ కావడం ఈమధ్య కాలంలో ఇదే. సంగీత ప్రియులు ఈ పాటను ఈ స్థాయిలో ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని నిర్మాత ఎస్వీ బాబు తెలిపారు.

‘‘ఈ చిత్రంలో హీరో ప్రదీప్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కొత్తగా కనిపిస్తారు. ఆ పాత్రలో ఆయన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండి అలరిస్తాయి. అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణ అవుతాయి. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఒక దృశ్య కావ్యంలా చిత్రాన్ని రూపొందించారు. లవ్ ఎంటర్టైనర్ గా సినిమా అలరిస్తుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

సాంకేతిక బృందం:

పాటలు: చంద్రబోస్

సంగీతం: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్

ఆర్ట్: నరేష్ తిమ్మిరి

పీఆర్వో: వంశీ-శేఖర్

నిర్మాత: ఎస్వీ బాబు

స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మున్నా

30 Rojulalo Preminchadam Ela Movie Censor Completed:

30 Rojulalo Preminchadam Ela Movie Censor Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ