Advertisementt

2021లో ‘హిట్’ సెకండ్ కేస్: నాని

Tue 03rd Mar 2020 05:52 PM
nani,vishwak sen,hit movie,success meet,highlights  2021లో ‘హిట్’ సెకండ్ కేస్: నాని
Hit Movie Success Meet Highlights 2021లో ‘హిట్’ సెకండ్ కేస్: నాని
Advertisement
Ads by CJ

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిర చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌లైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఈ సినిమా స‌క్సెస్‌మీట్ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా...

నిర్మాత ప్ర‌శాంత్ త్రిపిర్‌నేని మాట్లాడుతూ - ‘‘ఇలాంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. వారి ఆద‌ర‌ణ లేక‌పోతే మాలాంటి వారికి ఇలాంటి సినిమాలు చేయాలంటే ఎంక‌రేజ్‌మెంట్ ఉండ‌దు. సినిమాను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌’’ అన్నారు. 

సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికంద‌న్ మాట్లాడుతూ - ‘‘మా నిర్మాత‌లు నానిగారికి, ప్ర‌శాంతిగారికి థాంక్స్‌. శైలేష్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇలాంటి సినిమాల‌ను మ‌రిన్ని నిర్మించాల‌ని కోరుతున్నాను’’ అన్నారు. 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ - ‘‘ప్ర‌శాంతిగారికి, నానిగారికి థాంక్స్‌. వారితో పాటు నాకు అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ శైలేష్‌కి థాంక్స్‌. ప్ర‌తి ఒక్క‌రూ సినిమాను త‌మ‌దిగా భావించి స‌క్సెస్ చేశారు’’ అన్నారు. 

డైరెక్టర్ శైలేష్ మాట్లాడుతూ - ‘‘నానికి ఎలా థాంక్స్ చెప్పాలో తెలియ‌డం లేదు. ఆయ‌న ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తాన‌ని చెప్ప‌కుంటే నేను ఈరోజు ఇక్క‌డ ఉండేవాడిని కాను. ఇక‌పై నేను ఏ సినిమా చేసినా నానిగారే ముందు గుర్తుకు వ‌స్తారు. ఆయ‌న్ని గ‌ర్వంగా ఫీల‌య్యేలా చేస్తాను. ప్ర‌శాంతిగారికి కృతజ్ఞ‌త‌లు. విశ్వ‌క్‌సేన్ త‌ప్ప‌.. మ‌రొక‌రిని ఈ క్యారెక్ట‌ర్‌లో ఊహించుకోలేను. పాత్ర‌లో ఒదిగిపోయాడు. నేను రాసిన పాత్ర‌కు న్యాయం చేశాడు. న‌న్ను న‌మ్మి విశ్వ‌క్ న‌టించాడు. త‌న‌తో ఇంకా చాలా జ‌ర్నీ చేయాలి. రుహానీ శ‌ర్మ‌స్క్రీన్ టైమ్ త‌క్కువైనా అద్భుతంగా న‌టించింది. మ‌ణికంద‌న్‌గారు ప్ర‌తి సీన్‌ను అద్భుతంగా నేను ఊహించిన దానికంటే గొప్ప‌గా చూపించారు. వివేక్‌సాగ‌ర్ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా  ఇచ్చారు. త‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్‌. ఇక ఇందులో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. భ‌విష్య‌త్తులో మంచి సినిమాలే చేస్తాన‌ని ప్రామిస్ చేస్తాను’’ అన్నారు. 

హీరో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ - ‘‘కూల్ ప్రొడ్యూస‌ర్‌గా ఉండి స‌పోర్ట్ చేసిన ప్ర‌శాంతిగారికి థాంక్స్‌. మూడేళ్ల ప్ర‌యాణంలో మూడు సినిమాలు చేశాను. మూడు హిట్టే. అందులో ఇదే పెద్ద హిట్‌. శైలేష్‌కి థాంక్స్‌. ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కులు సినిమాను సొంత సినిమాగా భావించి ఎంకరేజ్ చేస్తున్నారు. మ‌ణికంద‌న్‌గారు నన్ను బాగా చూపించారు. వివేక్‌గారు నా సినిమాల్లో బెస్ రీరికార్డింగ్ ఇచ్చాడు. ఇంకా మంచి సినిమాలు చేస్తాను. భ‌విష్య‌త్తులో డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా చేస్తాను. నా కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన నాని అన్న‌కు, ప్ర‌శాంతిగారికి, శైలేష్‌గారికి, వివేక్‌, మ‌ణికంద‌న్ స‌హా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 

నిర్మాత నాని మాట్లాడుతూ - ‘‘స‌క్సెస్ కోసం ప్లాన్ చేయ‌డం లేదు.. జ‌రిగిపోతున్నాయి. యునిక్ కంటెంట్‌ను, టాలెంట్‌ను న‌మ్మి సినిమాలు చేస్తున్నాం. ప్ర‌తి సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అవుతుంది. ట‌క్ జ‌గ‌దీష్ సినిమా షూటింగ్ కోసం రాజ‌మండ్రికి వెళుతున్నాను. నిర్మాత‌గా గ‌ర్వంగా వెళుతున్నాను. తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. నేను నా సినిమాల‌తో బిజీగా ఉన్నా.. నా టీమ్ వ‌ల్లే ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చింది. సినిమాను అంద‌రూ త‌మ‌దిగా భావించి పెద్ద స‌క్సెస్ చేశారు. ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా త‌క్కువే. సినిమాను పైర‌సీలో చూడొద్దు. బిగ్ స్క్రీన్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియెన్స్ వేరుగా ఉంటుంది. 2021లో హిట్ సెకండ్ కేస్ రానుంది’’ అన్నారు.

Hit Movie Success Meet Highlights:

Celebrities Speech at Hit Movie Success Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ