Advertisementt

దిల్ రాజు నెక్స్ట్ టార్గెట్ అదేనా..?

Mon 02nd Mar 2020 06:00 PM
dil raju,pk,pawan kalyan,pk26 first look,pan india movie,tollywood  దిల్ రాజు నెక్స్ట్ టార్గెట్ అదేనా..?
Dil Raju next target would be..? దిల్ రాజు నెక్స్ట్ టార్గెట్ అదేనా..?
Advertisement
Ads by CJ

సాధారణంగా స్టార్ హీరో, హీరోయిన్లకి మంచి మార్కెట్ ఏర్పడుతుంది. సినిమాలో స్టార్ హీరో గానీ, హీరోయిన్ గానీ ఉన్నారంటే ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడు. సినిమాకి ఎంతో మంది పనిచేసినా ప్రేక్షకుడు సినిమాకి రావడానికి ప్రధాన కారణం హీరో హీరోయిన్లే.. అయితే తెర మీద కనిపించే వాళ్ళే కాదు తెర మీద కనబడని వాళ్లకి కూడా మార్కెట్ ఉంటుంది. కానీ ఒక నిర్మాతకి ఫాలోయింగ్ ఉండడం కేవలం దిల్ రాజు విషయంలోనే జరిగి ఉంటుంది.

 

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఏ సినిమాలో హీరో ఎవరనేది చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకి వస్తుంటారు. తెలుగులో సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు. ఎందరో స్టార్స్ తో కూడా సినిమాల్ని నిర్మించాడు. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని కలగా ఉండేదట. ఇప్పుడు వకీల్ సాబ్ తో ఆ కల కూడా నెరవేరుతుంది. ఈ రోజు ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

 

అయితే ప్రతీ నిర్మాతకి ఏదో ఒక కల ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు బాగా నడుస్తుంది. ప్రతీ నిర్మాత తన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని ఆరాటపడుతున్నాడు.  పవన్ కళ్యాణ్ తో సినిమా తర్వాత దిల్ రాజు కోరిక పాన్ ఇండియా సినిమానే అయి ఉంటుందని అనుకుంటున్నారు. సంవత్సరానికి అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా గడుపుతున్న దిల్ రాజు పాన్  ఇండియా మూవీ తీయాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు. మరి ముందు ముందు ఏం అవుతుందో చూడాలి.

Dil Raju next target would be..?:

Dil Raju Target would be Pan india Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ