Advertisementt

చిరు చేసిన పనికి తల పట్టుకున్న చెర్రీ - కొరటాల?

Mon 02nd Mar 2020 06:55 PM
chiranjeevi,announce,152 movie,title,acharya,ram charan,koratala siva  చిరు చేసిన పనికి తల పట్టుకున్న చెర్రీ - కొరటాల?
Charan and Koratala Siva Disappoints With Chiru Speech చిరు చేసిన పనికి తల పట్టుకున్న చెర్రీ - కొరటాల?
Advertisement
Ads by CJ

చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న చిరు152 టైటిల్ ‘గోవిందా ఆచార్య’ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పనిగట్టుకుని తెగ ప్రచారం చేస్తున్నారు. కొరటాల శివ - చిరు సినిమా మొదలైనప్పటి నుండి మెగా ఫ్యాన్స్ చిరు 152 టైటిల్ గోవిందా ఆచార్య అని ప్రచారం చెయ్యడమే కాదు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వదులుతూ అదే టైటిల్ ని ట్రేండింగ్ లోకి తెస్తున్నారు. ఇంత జరుగుతున్నా చిత్ర బృందం మాత్రం చిరు టైటిల్ విషయంలో గుంభనంగా ఉంది. అయితే మెగా ఫ్యాన్స్ సస్పెన్స్ ని బద్దలు కొడుతూ చిరు తన టైటిల్ ని తానే రివీల్ చేసేసాడు. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా చిరు టైటిల్ ని రివీల్ చెయ్యడం చూసి రామ్ చరణ్ తో పాటుగా కొరటాల ఇద్దరూ షాకయ్యారు.

చిరంజీవి తాజాగా ‘ఓ పిట్ట కథ’ ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవగా.. ఆ స్టేజ్ మీద ‘ఓ పిట్ట కథ’ సినిమా గురించి మాట్లాడుతూనే మధ్యలో కొరటాలతో తాను చెయ్యబోయే మూవీ ముచ్చట్లు లేపాడు. కొరటాల సినిమా విషయాలతో పాటుగా తాను నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ అంటూ తన సినిమా టైటిల్ ని తానే రివీల్ చేసేసాడు. రివీల్ చెయ్యడమే కాదు ఆ టైటిల్ ని అలా అనుకోకుండా రివీల్ చేసినందుకు చిరు ఏకంగా కొరటాలకు సారీ కూడా చెప్పేసాడు. ఒక మంచి విషయాన్నీ ఇలా దాచుకోవడం బాగోదని మాటల సందర్భంలో టైటిల్ ని చెప్పేశా అని కొరటాలకు చిరు సారి చెప్పి సరిపెట్టాడు.

దానితో మెగా ఫ్యాన్స్ ఆనందానికి ఆవధుల్లేవ్. మేము అనుకున్న ‘ఆచార్య’నే చిరు 152 టైటిల్ అంటూ వారు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. కానీ నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు కొరటాల మాత్రం షాకయ్యారు. టైటిల్ విషయాన్నీ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా స్పెషల్ గా విడుదల చేద్దామనుకుంటే చిరు మాత్రం ఇలా చడీచప్పుడు లేకుండా తుస్ మనిపించాడని అనుకుంటున్నారట.

Charan and Koratala Siva Disappoints With Chiru Speech:

Chiru Announces His 152 Film Title Acharya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ