Advertisementt

మరోసారి ప్రభాస్ సరసన బాలీవుడ్ బామ...?

Mon 02nd Mar 2020 02:27 PM
deepika padukone,prabhas,nag ashwin  మరోసారి ప్రభాస్ సరసన బాలీవుడ్ బామ...?
Again bollywood girl with Prabhas మరోసారి ప్రభాస్ సరసన బాలీవుడ్ బామ...?
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ సంపాదించుకున్న ప్రభాస్ తన తర్వాతి సినిమాల్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో జాన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ప్రభాస్ మరో సినిమాకి ఫిక్స్ అయ్యాడు. మహానటి ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్ సరసన ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తున్నారట. అయితే సాహో సినిమాలో బాలీవుడ్ భామ అయిన శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారు. నాగ్ అశ్విన్- ప్రభాస్ సినిమాలో కూడా బాలీవుడ్ భామనే తీసుకోవాలని చూస్తున్నారట. అయితే సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి దీపిక పదుకునేని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.

దీపికకి కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఉంది. ఆమె నటిస్తే సినిమాకి ఇంకా ఆడ్ ఆన్ అవుతుందని భావిస్తున్నారు. మరి ప్రభాస్ సరసన ఎవరు సెట్ అవుతారో చూడాలి.

Again bollywood girl with Prabhas:

Nag Ashwin prabhas movie launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ