Advertisementt

జయసుధ కొడుకు రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

Mon 02nd Mar 2020 05:04 AM
jayasudha,son,nihar,marriage,reception,update  జయసుధ కొడుకు రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి
Top celebrities at Jayasudha son marriage reception జయసుధ కొడుకు రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి
Advertisement
Ads by CJ

తారలు దిగివచ్చిన వేళ - జయసుధ కుమారుడి వివాహ విందులో సినీ రాజకీయ ప్రముఖుల సందడి.

ప్రముఖ సినీ నటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహ రిసెప్షన్‌ అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ వివాహ విందుకు టాలీవుడ్‌, బాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు కూడా హాజరై వధూవరులు నిహార్, అమ్రిత్ దంపతులను ఆశీర్వదించారు.  ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన అమృత కౌర్‌తో నిహార్‌ వివాహం ఢిల్లీలో గ్రాండ్‌గా జరిగింది.

సూపర్‌స్టార్‌ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ దంపతులు, నాగార్జున దంపతులు, జాకీష్రాఫ్, కృష్ణంరాజు సతీమణి శ్యామల, మోహన్‌బాబు దంపతులు, రాజశేఖర్ జీవిత దంపతులు, టి. సుబ్బిరామిరెడ్డి దంపతులు,  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, పొట్లూరి వరప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, రాజమౌళి దంపతులు, పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, నాగబాబు, దగ్గుబాటి సురేష్ బాబు, కృష్ణవంశీ, రమ్యకృష్ణ, దంపతులు, అలీ దంపతులు, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, రఘురామకృష్ణంరాజు, అరెకెపూడి గాంధీ, గంటా శ్రీనివాస్, బాబూ మోహన్, నరేష్,  చలపతిరావు, బెనర్జీ, దిల్ రాజు,  నమ్రత, బీవీఎస్ఎన్ ప్రసాద్, రాజా రవీంద్ర, అక్కినేని సుశీల, మంచు లక్ష్మి, శివబాలాజీ దంపతులు, హేమ,  అనితా చౌదరి, శుభలేఖ సుధాకర్, వైవిఎస్ చౌదరి , జెమినీ కిరణ్, సుహాసిని, ప్రభ, ఖుష్బూ తదితర  ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  సీనియర్‌ నటీమణులు తదితరులు హాజరై సందడి చేశారు. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ ఇద్దరు కుమారులున్నారు. నిహాన్‌ వ్యాపారవేత్తగా

రాణిస్తున్నారు. నటి జయసుధ ఇటు వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరో పక్క రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.

Top celebrities at Jayasudha son marriage reception:

Jayasudha Son Marriage Reception Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ