Advertisementt

యాంకర్ రవి ‘సమయమే తెలియదే..’ సాంగ్ విడుద‌ల‌

Mon 02nd Mar 2020 05:01 AM
hero karthikeya,anchor ravi,samayame teliyade,song,release  యాంకర్ రవి ‘సమయమే తెలియదే..’ సాంగ్ విడుద‌ల‌
Anchor Ravi Samayame Teliyade Song Released యాంకర్ రవి ‘సమయమే తెలియదే..’ సాంగ్ విడుద‌ల‌
Advertisement
Ads by CJ

హీరో కార్తికేయ చేతుల మీదుగా ‘సమయమే తెలియదే...’ పాట విడుద‌ల‌

సమయమే తెలియదే ఏమో ఏమో నీతో ఉంటుంటే.. సమయమే గడవదే ఏమో ఏమో నువ్వే లేకుంటే... ఇన్నాళ్లుగా నాలో కల ఎదురైయిందిలా నీవల్లేగా... ఇలాంటి అందమైన సాహిత్యంతో కూడిన రొమాంటిక్ గీతానికి ఆహ్లాదకరమైన సంగీతం జోడయితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాంటి పాటే ఆవిష్కృతమైంది. యాంకర్ రవి, తనూజ గౌడలపై చిత్రీకరించిన ఒక ప్రైవేట్ సాంగ్ ఇది. న్యూ  టాలెంట్ ని ప్రోత్సహించే బ్ల్యూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ ఈ అందమైన ప్రేమ గీతాన్ని మనకు అందించింది. సత్య సాగర్ పొలం రచించి సంగీతం అందించారు. సింగర్స్ హేమ చంద్ర, మౌనిక రెడ్డి చక్కగా ఆలపించిన ఈ పాటకు చిట్టి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటను ఫిబ్రవరి 29న ప్రసాద్ లాబ్స్ లో జరిగిన కార్యక్రమానికి  హీరో కార్తికేయ ముఖ్య అతిధిగా పాల్గొని ఈ పాటను విడుదల చేశారు. అనంతరం హీరో కార్తికేయ మాట్లాడుతూ - ‘‘ఈ పాట టీజర్ చూడగానే నచ్చి షేర్ చేశాను. ఇప్పుడు ఫుల్ సాంగ్ చూడగానే ఇంకా నచ్చింది. ముఖ్యంగా రవి, తనూజ ఇద్దరు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. రవి నాకు చాలా కాలంగా తెలుసు. చాలా హార్డ్ వర్కర్. తప్పకుండా ఈ పాట పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ లో మంచి కంటెంట్ ని ప్రోత్సహించి న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న బ్ల్యూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ కి నా అభినందనలు. ఇది ఎంతో మంది నూతన ఔత్స్థాహితులకి తప్పకుండా ఉపయోగపడుతుంది’’ అన్నారు.

యాంకర్ రవి మాట్లాడుతూ - ‘‘మా నాన్న గారికి నేను ఇలా కూడా చేయగలుగుతాను అని ప్రూవ్ చేయడానికి ఈ సాంగ్ చేశాను. దాంతో పాటు నటుడు అంతే అన్ని చేయగలగాలి.  తప్పకుండా ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. చిట్టి మాస్టర్ చక్కగా కంపోజ్ చేశారు. మా పాటను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన కార్తికేయ గారికి స్పెషల్ థాంక్స్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన బ్ల్యూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ కి కృతజ్ఞతలు’’ అన్నారు.

నోయెల్ సీన్ మాట్లాడుతూ - ‘‘సాంగ్ చాలా బాగుంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.  టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

బ్ల్యూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ నిరుప, సన్నీ మాట్లాడుతూ - ‘‘మా పాటను విడుదల చేసిన హీరో కార్తికేయ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మరో హీరో నోయెల్ కి థాంక్స్. సాంగ్ కి యూత్ నుండి చాలా మంచి అప్రిసియేషన్ వస్తోంది. రవి, తనూజ చక్కగా నటించారు.  సాంగ్ మంచి స్థాయికి వెళ్తుంది అనే నమ్మకం ఉంది. మా బ్ల్యూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తప్పకుండా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తాం’’ అన్నారు.

Anchor Ravi Samayame Teliyade Song Released:

Hero Karthikeya Releases Samayame Teliyade Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ