Advertisement

ఇంతకీ ‘హిట్’ సినిమా సంగతేంటి?

Sun 01st Mar 2020 05:46 PM
nani,producee,hit movie,vishwak sen,box office  ఇంతకీ ‘హిట్’ సినిమా సంగతేంటి?
Hit Movie Talk at Box Office ఇంతకీ ‘హిట్’ సినిమా సంగతేంటి?
Advertisement

నాని నిర్మాతగా ఫలక్‌నుమాదాస్ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని - విశ్వక్ సేన్ హీరోయిన్ రుహని శర్మ ప్రమోషన్స్ తో అలాగే హిట్ సినిమా ట్రైలర్ మీదున్న ఆసక్తితో హిట్ సినిమా మొదటిరోజు సందడి థియేటర్స్ దగ్గర బాగానే కనబడింది. రెండు డబ్బింగ్ సినిమాలు, రెండు స్ట్రయిట్ సినిమాల మధ్యన హిట్ నిజంగానే కాస్త ప్రత్యేకంగానే కనబడింది. రాహు, స్వేచ్ఛ రెండు తెలుగు సినిమాలు, కనులుకనులను దోచాయంటే ఓ మలయాళ డబ్బింగ్, లోకల్ బాయ్ ఓ తమిళ డబ్బింగ్ మధ్యన హిట్ సినిమాకే ప్రేక్షకులు పట్టం కట్టారనిపించింది. అయితే క్రైమ్ థ్రిల్లర్ కథతో  శైలేష్ కొలను సినిమాని ఆసక్తికరంగానే మలిచాడు. కానీ సినిమాలో పలు చోట్ల ఈజీ క్లూస్ ఇచ్చేయడం వల్ల ఆ సీన్స్ తాలూకు ఇంపాక్ట్ అంతగా లేదు.

అలాగే క్రైమ్ థ్రిల్లర్ కి సరిపడా కథను రాసుకున్నప్పటికీ ఒకటే పాయింట్‌పై నడిచే కథనం కావడంతో సాగదీత ఎక్కువగా అనిపిస్తుంది. విశ్వక్ సేన్ నటన, కథలోని మలుపులు, ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ అన్ని బావున్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ అంతా ఒకే చోట జరగడంతో ప్రేక్షకుడికి చూసిన సీనే మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక కథకి షాకింగ్ అండ్ థ్రిల్లింగ్ క్లైమాక్స్ ఇచ్చినట్టయితే డెఫినెట్‌గా టైటిల్‌కి తగ్గ సినిమా అని ఎవరయినా అనేస్తారు. కానీ సాంగ్స్, కమర్షియల్ ఎలిమినేట్స్ లేకపోవడం కూడా సినిమాకి మైనస్ అనే చెప్పాలి. నేపధ్య సంగీతాన్ని వివేక్ సాగర్ అందించిన తీరు సూపర్. అలాగే మణికందన్ ఫోటోగ్రఫీ అయితే ఎక్స్ లెంట్. మరి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ సినిమాలో సాగదీత సన్నివేశాల వలన, గొప్ప ట్విస్ట్ లు లేకపోవడంతో సినిమాకి యావరేజ్ పడింది. ఇక ఇలాంటి క్రైమ్ కథలున్న సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతాయి. 

Hit Movie Talk at Box Office:

Average Talk to Nani Produced Hit Movie 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement