Advertisementt

ఆకాశం నీ హద్దురా..హద్దులు బద్దలు కొట్టేలా ఉంది...

Sat 29th Feb 2020 08:18 PM
surya,aakasham nee hadduraa,sudha kongara  ఆకాశం నీ హద్దురా..హద్దులు బద్దలు కొట్టేలా ఉంది...
Surya coming with full of positive buzz ఆకాశం నీ హద్దురా..హద్దులు బద్దలు కొట్టేలా ఉంది...
Advertisement
Ads by CJ

తమిళ నటుడు సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. గజిని సినిమాతో తెలుగునాట పరిచయమైన సూర్య అప్పటి నుండి తన ప్రతీ సినిమాను తెలుగులో కూడా అనువాదం చేస్తున్నాడు. తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోకి గత కొన్ని రోజులుగా కలిసిరావట్లేదు. ఇటీవల వచ్చిన బందోబస్త్ సినిమా తెలుగునాట మినిమమ్ ఓపెనింగ్స్ ని కూడా తెచ్చుకోలేకపోయింది.

 

అదే బందోబస్త్ తమిళనాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బందోబస్త్ సినిమా పరాజయం కావడంతో సూర్యకి తెలుగు మార్కెట్ బాగా దెబ్బతింది. అయితే ఇప్పుడు తన మార్కెట్ ని తిరిగి తెచ్చుకునేలా కనబడుతున్నాడు. సూర్య ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేస్తున్నాడు. నిజ జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహిస్తుంది. ఈ చిత్రంలో తెలుగు నటుడు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

ఈ చిత్రం నుండి మోహన్ బాబుగారి లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఎయిర్ ఫోర్స్ ఆఫీసరుగా మోహన్ బాబు గారి లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల అవుతున్న ఈ సినిమా ద్వారా సూర్య తన మార్కెట్ ని తిరిగి తెచ్చుకునేలా కనబడుతున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు పాజిటివ్ బజ్ కూడా తోడైంది. సూర్య గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రానికి మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది.

 

అందువల్ల ఈ సారి సూర్య తన హద్దులు చెరిపేసుకుని విరుచుకుపడేలా కనబడుతున్నాడు. మరి సూర్య అనుకున్నది చేస్తాడా లేదా చూడాలి.

Surya coming with full of positive buzz:

Suryas upcoming movie Aakasham Nee Hadduraa directed by Sudha Kongara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ