Advertisementt

హీరోయిన్ గా నిలబడలేకపోయింది...సోలోగా ఎలా..?

Sat 29th Feb 2020 07:19 PM
payal rajput,rx 100,rdx love,disco raja  హీరోయిన్ గా నిలబడలేకపోయింది...సోలోగా ఎలా..?
Payal as a IPS officer హీరోయిన్ గా నిలబడలేకపోయింది...సోలోగా ఎలా..?
Advertisement
Ads by CJ

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత ఆ గుర్తింపుని వాడుకోవడంలో తప్పటడుగులు వేసి చతికిల పడింది. ఆర్ ఎక్స్ 100 లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించిన పాయల్ ఆ తర్వాత వచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ లోనూ అలాంటి తరహా పాత్రనే చేసి చేతులు కాల్చుకుంది. ఆర్ డీ ఎక్స్ లవ్ సినిమా వల్ల ఆమెకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె దగ్గరికి ఆఫర్లు రావడం బాగా తగ్గింది. 

 

ఆర్ డి ఎక్స్ తర్వాత పాయల్ రవితేజతో డిస్కోరాజా లో, వెంకటేష్ తో వెంకీమామాలో నటించింది. కానీ ఈ రెండు చిత్రాలు ఆమెకి ఏమాత్రం గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. దాంతో ఆమె పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయితే ప్రస్తుతం పాయల్ లీడ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రాణదీప్ అనే కొత్త  దర్శకుడు తెరకెక్కిస్తోన్న క్రైమ్ మిస్టరీలో ఓ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తోంది.

 

అసలే హీరోయిన్ గా తనకి ఎలాంటి క్రేజ్ లేని సమయంలో ఇలాంటి పాత్రలు చేయడం వల్ల ఆమె కెరీర్ కి దెబ్బపడుతుందనే వాదన వినిపిస్తోంది. హీరోయిన్ గా నిలదొక్కుకున్న తర్వాత ఇలాంటి పాత్రలు చేస్తే బాగుంటుందని..అంతేకానీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిది కాదని సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ గనక తేడా కొట్టిందంటే పాయల్ సర్దేసుకోవాల్సిందే అని అంటున్నారు.

Payal as a IPS officer:

Payal Rajput coming with a solo lead film 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ