Advertisementt

నాగి-ప్రభాస్ మూవీ ఎన్ని భాషల్లో అంటే..!

Sun 01st Mar 2020 12:09 AM
prabhas-nag aswin movie,darling prabhas,nagi,vyjayanthi movies  నాగి-ప్రభాస్ మూవీ ఎన్ని భాషల్లో అంటే..!
Prabhas-Nag Aswin Movie Release In These Languages నాగి-ప్రభాస్ మూవీ ఎన్ని భాషల్లో అంటే..!
Advertisement
Ads by CJ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమా రానుండగా.. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే సినిమా ప్రకటన చేసిన మరు క్షణం నుంచి అసలు ఎలా ఉండబోతోందనే దానిపై పెద్దఎత్తున చర్చ నడవగా.. సినిమా మొత్తం ‘సైన్స్ ఫిక్షన్’ నేపథ్యంలో కొనసాగుతుందని వార్తలు గుప్పుమన్నాయ్. అంతేకాదు.. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడని.. సూపర్ నేచురల్ పవర్స్ వుండే హీరోలా పాత్ర ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే డార్లింగ్ బాడీ లాంగ్వేజ్ మొత్తం ‘క్రిష్’ చిత్రంలో హృతిక్ రోషన్‌లా ఉంటుందట. 

అయితే ఇలా పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో దర్శకనిర్మాతల నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. అదేమిటంటే.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారన్నదే ఆ న్యూస్ సారాంశం. ఈ విషయాన్ని చిత్రబృందమే అధికారికంగా ప్రకటించింది.

అశ్విన్– ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయ్. అంటే బాలీవుడ్‌ను కూడా మరోసారి దున్నేయడానికి డార్లింగ్ సిద్ధమయ్యాడట. మొత్తానికి చూస్తే.. ఈ భారీ బడ్జెట్ సినిమాపై అభిమానులు మాత్రం పెద్ద ఎత్తునే అంచనాలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ రిలేటెడ్ సినిమాలు ఈ మధ్య అస్సలు డైరెక్టర్లకు కలిసి రావట్లేదన్నది జగమెరిగిన సత్యమే. అయితే సైన్స్ ప్రిక్షన్ రిలేటెడ్ సినిమానే అయితే దాన్ని నాగి ఎలా హ్యాండిల్ చేయగలడు అనేదానిపై అభిమానులు సర్వత్రా ఎదురుచూస్తున్నారు. మరి చివరికి ఏం తేలుతుందో ఏంటో వేచి చూడాల్సిందే.

Prabhas-Nag Aswin Movie Release In These Languages:

Prabhas-Nag Aswin Movie Release In These Languages  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ