Advertisementt

అల్లు అర్జున్ కొత్త లుక్ వచ్చేసింది!

Sun 01st Mar 2020 12:00 AM
allu arjun,new look,bunny-sukku movie,bunny new look  అల్లు అర్జున్ కొత్త లుక్ వచ్చేసింది!
Allu Arjun New Look Revealed! అల్లు అర్జున్ కొత్త లుక్ వచ్చేసింది!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ప్రస్తుతం కేరళ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే బన్నీ డ్యూయల్ రోల్‌ చేస్తున్నడని వార్తలు వచ్చాయి. అందులో ఒక పాత్ర మోడరన్‌గా, క్లాస్‌గా కనిపిస్తే.. ఇంకో పాత్ర పెంచిన గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపిస్తుందనేది ఆ పుకార్ల సారాంశం.

అయితే తాజాగా బయటికి వచ్చిన ఫొటోలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమేనని తెలిసిపోయింది. మంకీ క్యాప్‌, గడ్డంతో ఆయన కనపడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. మా బన్నీ వచ్చేశాడోచ్ ఇక చూస్కోండి అంటూ అభిమానులు తాజా లుక్ తాలుకు ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నాడు. ఆయన లుక్‌ను చూసి మెస్మరైజ్‌ అయిన ఫ్యాన్ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడని తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా నడుస్తుందట. అందుకే ‘శేషాచలం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనీ కూడా కొద్ది రోజుల క్రితం ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ నడుస్తుందనీ, అలా స్మగుల్ అయ్యే ఎర్రచందనాన్ని తన లారీలో తీసుకెళ్లే ఒక లారీ డ్రైవర్‌గా బన్నీ కనిపిస్తాడనీ కూడా కథలు పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో నిజానిజాలెంత.. ? ‘అల వైకుంఠపురములో..’ రేంజ్‌ హిట్‌ను ఈ సినిమా సెట్ చేస్తుందా..? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Allu Arjun New Look Revealed!:

Allu Arjun New Look Revealed!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ