Advertisementt

రౌడీ స్టార్ చేసిన పనితో ఫ్యాన్స్ హ్యాపీ

Sat 29th Feb 2020 11:50 PM
vijaya deverakonda,fans,happy,remuneration,producer,world famous lover,rowdy star  రౌడీ స్టార్ చేసిన పనితో ఫ్యాన్స్ హ్యాపీ
Fans Happy With Vijaya Deverakonda Decision రౌడీ స్టార్ చేసిన పనితో ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే పూరి - విజయ్ సినిమా ముచ్చట్ల కన్నా ఎక్కువగా అతని ప్లాప్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ప్రతిరోజు హైలెట్ అవుతూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ అవడమే దాన్ని పట్టించుకోవడం మానేసాడు. కానీ ప్రేక్షకులు ఊరుకుంటారా.. రోజూ పుండు మీద కారం చల్లుతూనే ఉన్నారు. మధ్యలో వరల్డ్ ఫేమస్ లవర్ నిర్మాత గగ్గోలు. ఈ సినిమాతో 15 కోట్లు పోగొట్టుకున్నాను అని, ఇల్లు కూడా తాకట్టు పెట్టాడనే న్యూస్ రావడం, అలాగే విజయ్ కూడా సినిమాలో వేళ్ళు పెట్టి కెలకడం వలనే సినిమా అలా తయారైందంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో విజయ్ ఇమేజ్ ఎంతో కొంత డ్యామేజ్ అయ్యింది.

అయితే ఈ సినిమాతో బయ్యర్లు, నిర్మాత భారీగా నష్టపోయారనే న్యూస్ ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ తన పారితోషకం నుండి సగం నిర్మాతకి వెనక్కి ఇచ్చేసాడనే న్యూస్ నడుస్తుంది. నిర్మాత కె ఎస్ రామారామారావు తాను ఈ సినిమాతో నష్టపోయాను అని అడగగానే విజయ్ దేవరకొండ తన పారితోషకంలో సగం వెనక్కి ఇచ్చేశాడట. సినిమా షూటింగ్ లేట్ అవడం, అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ అవడంతో నిర్మాత భారీగా నష్టపోవడంతో విజయ్ దేవరకొండ బాగా ఆలోచించి పారితోషకంలో సగం వెనక్కి ఇచ్చేసి రియల్ హీరో అనిపించుకున్నాడని రౌడీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Fans Happy With Vijaya Deverakonda Decision:

Vijaya Deverakonda Gives Half Remuneration to wFL Producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ