Advertisementt

చిరు 152: మహేష్ ఫ్యాన్స్ దీన్ని తట్టుకోగలరా!

Sat 29th Feb 2020 11:45 PM
chiranjeevi,mahesh babu,key role,chiru 152  చిరు 152: మహేష్ ఫ్యాన్స్ దీన్ని తట్టుకోగలరా!
Intersting Update on Mahesh Role in Chiru 152 Movie చిరు 152: మహేష్ ఫ్యాన్స్ దీన్ని తట్టుకోగలరా!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి సినిమాకి ‘నో’ చెప్పాడనే టాక్ నడుస్తుంది. మరో పక్క ఎవ్వరూ ఊహించని విధంగా మెగాస్టార్ చిరు - కొరటాల శివ సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడంటూ సోషల్ మీడియా టాక్. కానీ రెండిటిలో ఏది నిజమనేది ఎవ్వరికి పక్కా క్లారిటీ లేదు. కానీ చిరు సినిమాలో సూపర్ స్టార్ మాత్రం పక్కా అంటున్నారు. చిరు మీద గౌరవం, కొరటాల మీద అభిమానం, అలాగే సినిమాలో తన పాత్ర నచ్చబట్టే మహేష్ బాబు ఈ గెస్ట్ రోల్ కి ఒప్పుకున్నాడనే టాక్ ఉంది. ఈ సినిమాలో చిరు నక్సలైట్ గా కనబడతాడు, చిరు యంగ్ రోల్ రామ్ చరణ్ నటిస్తున్నాడని అంటున్నారు. అయితే కొరటాల మహేష్ రోల్ ని పక్కాగా, అద్భుతంగా రాసాడని అంటున్నారు.

మహేష్ గెస్ట్ రోల్ కాకుండా నిడివి ఎక్కువ ఉన్న పాత్రే చేస్తున్నాడని అది కూడా 20 నుండి 25 నిముషాలు మహేష్ రోల్ ఉంటుంది అని.. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే మహేష్ పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందని అంటున్నారు. కథలో మహేష్ పాత్రే కీలకమంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఈ పాత్ర కోసం మహేష్ భారీగా పారితోషకం అందుకోబోతున్నట్టుగా ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ పాత్ర విషయంలో బయటికొచ్చిన న్యూస్ చూస్తే అసలు దీనికి మహేష్ అభిమానులు ఒప్పుకుంటారా అనిపిస్తుంది. అదేమిటంటే సినిమాలో మహేష్ కేరెక్టర్ చనిపోతుందని అక్కడ్నుంచి సినిమా రేంజ్ కూడా మారిపోతుందని మహేష్ పాత్ర చనిపోయిన తర్వాత చిరంజీవి వెళ్లే దారి సినిమా రేంజ్ పెంచేస్తుందని అంటున్నారు. మరి మహేష్ అభిమానులే కాదు అసలు ఈ పాత్ర చెయ్యడానికి మహేష్ ఎలా ఒప్పుకున్నాడు? ఆ పాత్ర అంత ప్రత్యేకమైందా? అంటూ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ నడుస్తుంది.

Intersting Update on Mahesh Role in Chiru 152 Movie:

Mahesh Babu Key Role Chiru 152 Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ