Advertisementt

శ్రీవిష్ణు హీరోగా ‘రాజ రాజ చోర’

Sat 29th Feb 2020 10:40 PM
sree vishnu,people media factory,abhishek agarwal arts,new movie,title,raja raja chora  శ్రీవిష్ణు హీరోగా ‘రాజ రాజ చోర’
Sri Vishnu Next Film Announced శ్రీవిష్ణు హీరోగా ‘రాజ రాజ చోర’
Advertisement
Ads by CJ

‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం ‘రాజ రాజ చోర’

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని  నిర్మిస్తున్నాయి. సునయన నాయిక. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా నేడు చిత్రం  తొలి ప్రచార చిత్రాన్నివిడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే పేరును నిర్ణయించారు. ‘హసిత్ గోలి’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు అని చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ తెలిపారు.

శ్రీవిష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగిన వారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పేరును, తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ నాటికి చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేదరామన్

సంగీతం: వివేక్ సాగర్

ఎడిటింగ్: విప్లవ్ నైషధం

ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె

క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి

సహ నిర్మాత: వివేక్ కూచి భొట్ల

నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్

రచన-దర్శకత్వం: హసిత్ గోలి

Sri Vishnu Next Film Announced:

Sree Vishnu film with People Media Factory and Abhishek Agarwal Arts titled Raja Raja Chora

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ