యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమా రానుండగా.. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన కూడా చేసింది. సినిమా మొత్తం ‘సైన్స్ ఫిక్షన్’ నేపథ్యంలో కొనసాగన్నదని ఓ పుకారు షికారు చేస్తోంది. అంతేకాదు.. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడని.. సూపర్ నేచురల్ పవర్స్ వుండే హీరోలా పాత్ర ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే డార్లింగ్ బాడీ లాంగ్వేజ్ మొత్తం ‘క్రిష్’ చిత్రంలో హృతిక్ రోషన్‌లా ఉంటుందట. అంటే.. ఇప్పుడు ప్రభాస్ కూడా బాలీవుడ్ హీరోలతో పోటీ పడిన ‘బాహుబలి’ లో మాదిరిగా కండలు పెంచాలన్న మాట. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఇటు నాగీ.. అటు అశ్వనీదత్ ఆచితూచి అడుగులేస్తున్నారట.
పాన్ ఇండియా అనడం కంటే పాన్ వరల్డ్ సినిమాగా తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు భాషలలో ఈ చిత్రం విడుదల చేస్తామని నాగ్ అశ్విన్ ప్రకటించాడు. అంతేకాదు.. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్తామని.. 2021 చివరి కల్లా విడుదల చేస్తామని తెలిపాడు. అంటే.. అప్పటికే ఓటమెరుగని దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయిపోయి రికార్డులు బ్రేక్ చేసేస్తుందేమో. అంటే అన్ని అయిపోయాకా నిదానంగా వచ్చి ఆ రికార్డులన్నీ ప్రభాస్ బద్ధలు కొడతాడన్న మాట. అంతేకాదు.. ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఎందుకంటే సినిమా కథ అలా ఉందట. ఈ కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్‌లో జనాలు ఊహించేసుకుంటున్నారు. మరి ‘ఆర్ఆర్ఆర్’ డార్లింగ్ ఏ మాత్రం ఢీ కొడతాడో లేకుంటే ఢీలా పడతాడో తెలియాలంటే వచ్చే ఏడాదివరకూ వేచి చూడాల్సిందే మరి.