సినీ ఇండస్ట్రీలో హిట్‌లు పడితేనే డైరెక్టర్‌ను అయినా.. హీరోను అయినా జనాలు గుర్తుపెట్టుకుంటారు. ప్లాప్‌లు పడితే మాత్రం అస్సలే పట్టించుకోరు.. పత్తా లేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఒకప్పుడు వరుస విజయాలతో అగ్రదర్శకుడు అనిపించుకున్న శ్రీను వైట్ల.. ఆ తరువాత వరుస పరాజయాలతో అట్టర్ ప్లాప్ అయ్యారు. దీంతో ఆయన మరుగున పడిపోయాడు. ఆ తర్వాత ఆయనతో సినిమా అంటే హీరోలు వణికిపోతున్నారట. ఇప్పటికే ఒకట్రెండు కథలు సిద్ధం చేసుకున్న శ్రీను వైట్ల హీరో కోసం వెతికే పనిలో నిమగ్నమయ్యాడట.
ఈ క్రమంలో కొరటాల శివ సినిమాలో బిజీబిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. దీంతో అసలేం జరుగుతోంది..? కొంపదీసి ఈ కాంబోలో నెక్స్ట్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి..? అని హాట్ టాపిక్ నడుస్తోంది. ఇదివరకే ‘అందరివాడు’ సినిమాను చిరుతో తెరకెక్కించగా ఆశించినంతగా ఆడలేదు. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ ఇస్తాను సార్.. నన్ను నమ్మండి ప్లీజ్ అని బతిమలాడి మరీ కథ వినిపించాడట. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దర్శకుడు.. పైగా కలిసి పనిచేసిన డైరెక్టర్ కావడంతో కాదనలేకపోయిన చిరు కాస్త ఓపిక తెచ్చుకుని మరీ విన్నాడట.
కథ అంతా విన్నాక సరే తర్వాత చూద్దాం.. ఇంకోసారి కలుద్దామని చిరు చెప్పగా హమ్మయ్యా.. విన్నారు కదా గ్రీన్ సిగ్నల్ వస్తుందిలే అని కోటి ఆశలతో ఉన్నాడట శ్రీను వైట్ల. వాస్తవానికి ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన ఈయనకు ఇలాంటి పరిస్థితి రావడం కొంచెం విచారించ దగ్గ విషయమే అయినప్పటికి పరిస్థితులు అలా ఉన్నాయ్ మరి. ఒకవేళ చిరు ఒప్పుకున్నా.. మరికొన్ని కథలు మాత్రం అలానే ఉండిపోతాయట. అంటే.. ఈ డైరెక్టర్‌కు ఇప్పుడు హీరోలు కావాలన్న మాట.