Advertisementt

రీమేక్‌లు అస్సలు చేయనంటున్న కుర్ర హీరో!

Fri 28th Feb 2020 09:17 PM
dulquer salmaan,remake,movies,mahanati  రీమేక్‌లు అస్సలు చేయనంటున్న కుర్ర హీరో!
I Dont Do Remake Said Young Hero! రీమేక్‌లు అస్సలు చేయనంటున్న కుర్ర హీరో!
Advertisement
Ads by CJ

మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన దుల్కర్ సల్మాన్‌కు ఆయన సొంత భాషలోనే కాకుండా తెలుగు, తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగులో ‘మహానటి’లో కీర్తి సురేశ్ సావిత్రిగా నటించగా.. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ నటించి మెప్పించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా తమిళంలో దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ‘కన్నుమ్ కన్నుమ్ కల్లైయాడి తాల్’ సినిమాలో నటించాడు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దుల్కర్ సరసన రీతూ వర్మ జంటగా నటించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌గా ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్‌తో థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సల్మాన్‌ తన రుచులు, అభిరుచులు పంచుకున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. సినిమా కథ, సాంగ్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతాయన్నాడు.

‘నా సినీ కెరీర్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ రీమేక్‌ సినిమాలు చేయట్లేదు. రీమేక్‌లు అంటే నాకు పడదు.. అస్సలు చేయను. రీమేక్‌లకు నేను పూర్తిగా వ్యతిరేకిని. కథల్లో కొత్తదనం ఉంటేనే ఆ దర్శకుడితో చేయడానికి నేను ఇష్టపడతానంతే. అలాంటి కథ కాబట్టే నేను తాజా సినిమా చేశాను. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.. మీరంతా సినిమాను హిట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. ఈ సినిమాకు మంచి హిట్‌ను తెచ్చిపెడుతుంది. అంతేకాదు.. డైరెక్ట్‌గానే తెలుగులో చేయాలని కొందరు డైరెక్టర్‌లు నన్ను సంప్రదించారు. ఆఫర్లు అయితే వస్తున్నాయ్.. ఈ ఏడాది చివరిలో చేస్తాను’ అని దుల్కర్ సల్మాన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. మొత్తానికి చూస్తే రీమేక్‌ అంటే ఈ కుర్ర హీరో ఆమడ దూరంలో ఉన్నాడన్న మాట.

I Dont Do Remake Said Young Hero!:

Dulquer Salmaan Talks About Remakes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ