నా ‘కలర్‌ఫోటో’ కి విలన్ సునీల్
సునీల్ కమెడియన్ గా, హీరోగా పలు చిత్రాలు నటించి మెప్పించాడు. తెలుగు సినిమా పుస్తకంలో సునీల్ ది ఓ ఛాప్టర్ వుంది. కమెడియన్ గా ఎవ్వరికి ఏ హని చెయ్యలేదు. హీరోగా ఎవరిని ఎప్పుడూ కష్టపెట్టలేదు. తన పర్సనల్ లైఫ్ లో కూడా తనకున్నదాన్ని వేరేవారికి సహాయం చేశాడే తప్ప కించింత్ కూడా ఇబ్బంది పెట్టలేదు. కాని ఓ దర్శకుడు మాత్రం నా కలర్‌పోటో కి సునీల్ విలన్ అంటున్నాడు. అసలు కలర్‌ఫోటో ఏంటి.. సునీల్ విలన్ ఏంటి..
కథలోకి వస్తే.. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడిలతో బ్లాక్ బస్టర్స్ కొట్టి మైండ్‌బ్లాక్ చేసిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటోని లౌఖ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం ప్రారంభం రోజునే చెప్పాం. ఆ తరువాత అమరావతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుందని నిర్మాతలు సోషల్ మీడియాలో చెప్పుకున్నారు. అయితే అక్కడ ఈ మధ్యే మజిలి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ప్రతిరోజూ పండగే చిత్రాల్లో కమెడియన్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న సుహాస్ హీరోగా చేస్తున్నాడు. ఇతనికి జోడిగా తెలుగమ్మాయిగా పదిమందికి తెలిసిన చాందిని చౌదరి జోడిగా నటిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే
యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ మొట్టమొదటిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ దర్శకత్వం (కథ ఇతనిది కాదు) చేస్తున్నాడు. అన్ని బాగున్నాయి సునీల్ మీ కలర్ ఫోటోకి విలన్ ఏంటి అంటే మాత్రం అదంతా ధియోటర్స్ లో చూడండి ఆయన చేసిన పనేంటో సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే అంటూ ఇటీవలే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాలభైరవ అందించిన స్వరాలతో ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళందర్ని పెట్టుకుని 1995 సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజిలో జరిగిన ప్రేమకథని సీరియస్ గా తీయటానికి సాయి రాజేస్ నీలం, బెన్నీ ముప్పనేనిలు నడుం బిగించారు. వీరికి శ్రవణ్ కొంక ఆశీర్వాదాలు అందించాడు. వీళ్ళ తోకలు కత్తిరించే పనిని మాత్రం కోదాటి పవన్ కళ్యాణ్ కి అప్పజెప్పారు. వీళ్ళ మధ్య గొడవలకి కారణం ఎ.విజయ్ అయితే వాటిని కూడా అందంగా చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నారు వెంకట్ ఆర్ శాఖమూరి. కలర్ ఫోటోని అందంగా డెకరేట్ చెయ్యటానికి క్రాంతి ప్రియం బాద్యతలు తీసుకుంటే వీళ్ళు ఏ ఫోటో ఇచ్చినా దాన్ని కలర్ ఫోటోగా బయటకి చూపించటానికి మాత్రం ఏలూరు శ్రీను తీసుకున్నారు.
గమనిక.. ఈ రోజు వెర్సటైట్ ఆర్టిస్ట్ సునీల్ పుట్టినరోజు సందర్భంగా కలర్‌ఫోటో లుక్ ని విడుదల చేశారు. చాలా మంచి రెస్పాన్స్ రావటం విశేషం.
సునీల్ స్పందిస్తూ... కలర్ ఫోటోలో రామరాజుగా కనిపిస్తున్నాను. నా కెరీర్ లో బెస్ట్ కేరక్టర్ చేస్తున్నాను. అలాగే నా పాత్రలో వున్న కొత్తదనమే అందర్ని ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్రలతో నా ఫ్యాన్స్ ని అలరిస్తాను అని అన్నారు.
కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం మరిన్ని విశేషాలు యూనిట్ త్వరలో తెలుపనున్నారు.
బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రవణ్ కొంక
లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్
పిఆర్ఒ: ఏలూరు శ్రీను