అవును.. ఆ స్టార్ నటి షూటింగ్ చేద్దాం మేడం.. మీరు రెడీనా అనే ఫోన్ కాల్ వచ్చినప్పుడల్లా భయంతో వణికిపోతోందట. అంతేకాదు.. ఇప్పట్లో వద్దు బాబోయ్.. నేనింకా షాక్‌లోనే ఉన్నా.. ఆ షాక్‌లో నుంచి బయటికొచ్చాక చేద్దామని చెబుతోందట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా..? అదేనండోయ్ ‘చందమామ’లాంటి బ్యూటీ కాజల్ అగర్వాల్.. ఎందుకంతాలా భయపడుతోందబ్బా..? అనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నా ఆగండి..!
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్ర షూటింగ్‌లో ఇటీవల ఓ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తునుంచి క్రేన్ టెంట్‌పై ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడికక్కడే ముగ్గురు టెక్నీషియన్లు కుప్పకూలిపోయారు. అయితే.. కన్నుమూసి తెరిసేలోపే జరిగిన ఈ ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో కమల్ హాసన్, శంకర్, కాజల్ అగర్వాల్‌తో పలువురు క్షేమంగా బయటపడ్డారు. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది చిత్రబృందం.
ఇదివరకే షూటింగ్ పాల్గొనండి సార్ అని కమల్‌కు లైకా సంస్థ నుంచి కబురొచ్చింది. అదే క్రమంలో కాజల్‌కు కూడా ఫోన్ వెళ్లిందట. వామ్మో ఇప్పట్లో నేను షూటింగ్ పాల్గొనలేను.. అంటూ ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతోందట. ఇంకా ఆ ఘటన తాలుకు దృశ్యాలు కాజల్ కళ్ల ముందే మెదులుతున్నాయట. ఇంకో రెండు మూడు వారాల పాటు తాను షూటింగ్ పాల్గొనలేనని మేనేజర్‌తో నిర్మాత, డైరెక్టర్‌కు చెప్పించిందట. కాజల్ ఇంతలా భయపడిపోతోందంటే ఆ ఘటన ఎలా జరిగి ఉంటుందో అర్థం చేస్కోండి. అదికూడా వెంట్రుక వాసిలో ఆ ప్రమాదం నుంచి బయటపడటంతో షూటింగ్ పేరెత్తితేనే భీతిల్లి పోతోందట. మరి ఈ భామ ఎప్పుడు షూటింగ్‌కు వస్తుందో.. ఏంటో..!