Advertisementt

‘ఆకాశం నీ హద్దురా’లో మోహన్‌బాబు లుక్ ఇదే!

Fri 28th Feb 2020 08:40 PM
mohan babu,first look,suriya,mentor bhaktavatsalam naidu,aakasam nee haddura,movie  ‘ఆకాశం నీ హద్దురా’లో మోహన్‌బాబు లుక్ ఇదే!
Mohan Babu look from Aakasam Nee Haddura Out ‘ఆకాశం నీ హద్దురా’లో మోహన్‌బాబు లుక్ ఇదే!
Advertisement
Ads by CJ

‘ఆకాశం నీ హద్దురా’లో భక్తవత్సలం నాయుడుగా డాక్టర్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల

సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న డాక్టర్ మోహన్ బాబు చివరగా నటించిన చిత్రం.. జాతీయ అవార్డులు పొందిన ‘మహానటి’. సూర్య హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఆకాశం నీ హద్దురా’లో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తనను సంప్రదించినప్పుడు వెంటనే ఆయన అంగీకరించారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమవుతోంది.

కాగా, ఈ సినిమాకు సంబంధించి మోహన్ బాబు పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. వాటిలో ఆయన సీనియర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా డైనమిక్ లుక్స్ తో కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రపేరు భక్తవత్సలం నాయుడు. ఎయిర్ ఫోర్స్ లో తెలుగు ప్రాంతానికి చెందిన ఉన్నతస్థాయి అధికారిగా ఆయన కనిపించనున్నారు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అనే విషయం మనకు తెలిసిందే. సినిమాలో ఆయనది సూర్యకు మార్గనిర్దేశకునిగా పాత్ర. తమిళ వెర్షన్ కోసం తన పాత్రకు ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పారు.

మోహన్ బాబుపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణ అవుతాయనీ, ఆయన పాత్రను అభిమానులు బాగా లైక్ చేస్తారనీ చిత్ర బృందం చెబుతోంది. తనకే సాధ్యమైన విలక్షణ శైలితో ఆ పాత్రను ఆయన రక్తి కట్టించారు. సామాన్యులకు సైతం విమానయానాన్ని సులభతరం చేయడానికి ఎయిర్ దక్కన్ అనే ఎయిర్ లైన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘ఆకాశం నీ హద్దురా’ రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య జోడీగా అపర్ణా బాలమురళి నటిస్తున్నారు. పనిచేసిన వారందరికీ కలకాలం గుర్తుండిపోయేలా ఈ సినిమాను సుధ కొంగర రూపొందిస్తున్నారు. ఆసక్తికరమైన స్క్రిప్ట్, అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలను మేళవించి ఆమె దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగాకు దక్షిణాదిన తొలి సినిమా కావడం గమనార్హం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. 2020 ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సూర్య, డాక్టర్ ఎం. మోహన్ బాబు, అపర్ణ బాలమురళి, పరేష్ రావల్, ఊర్వశి, కరుణాస్, వివేక్, ప్రసన్న, కృష్ణ కుమార్, కాళీ వెంకట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక బృందం:

కథ, దర్శకత్వం: సుధ కొంగర

సంగీతం: జీవీ ప్రకాష్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి

ఆర్ట్: జాకీ

ఎడిటర్: సతీష్ సూర్య

స్క్రీన్ ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర

అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆలిఫ్ సుర్తి, గణేషా

డైలాగ్స్: రాకేందు మౌళి

కొరియోగ్రఫీ: శోభి, శేఖర్ వీజే

యాక్షన్: గ్రెగ్ పోవెల్, విక్కీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అచిన్ జైన్, పవిత్ర

పీఆర్వో: వంశీ-శేఖర్

సహ నిర్మాతలు: రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి

నిర్మాత: సూర్య

బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్, శిఖ్యా ఎంటర్ టైన్మెంట్

Mohan Babu look from Aakasam Nee Haddura Out:

Mohan Babu First Look As Suriya’s Mentor Bhaktavatsalam Naidu in Aakasam Nee Haddura

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ