Advertisementt

దగ్గుబాటి మాస్టర్ ప్లాన్.. వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్!

Fri 28th Feb 2020 06:16 PM
daggubati suresh babu,ys jagan,ramanaidu studio,andhra pradesh  దగ్గుబాటి మాస్టర్ ప్లాన్.. వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్!
Daggubati Suresh Master Plan.. YS Jagan Green Signal! దగ్గుబాటి మాస్టర్ ప్లాన్.. వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్!
Advertisement
Ads by CJ

టైటిల్ చూడగానే.. ఇదేంటి అసలు దగ్గుబాటి ఫ్యామిలీకి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసలు సంబంధమేంటి..? అసలు ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి..? జగన్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..? ప్రస్తుతం నెట్టింట్లో.. ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన ఈ వ్యవహారంపై ఏమనుకుంటున్నారు..? అనే ఆసక్తికర విషయాలను www.cinejosh.com అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ నిర్మాతల్లో దగ్గుబాటి సురేశ్ బాబు కూడా ఉన్నారు. వాస్తవానికి వీళ్లంతా కలిసి అరగంటకుపైగా మాట్లాడిన తర్వాత సురేశ్ మాత్రం జగన్‌ను మళ్లీ ప్రత్యేకంగా కలిశారట. విజయవాడ లేదా విశాఖలో తాను స్టూడియో కట్టుకోవడానికి అనువుగా ఉండే స్థలాలు కేటాయించాలని కోరారట. అయితే సురేశ్ నోటి నుంచి ఆ మాట వచ్చిందో లేదో.. ‘కచ్చితంగా అన్నా.. మంచి మాట చెప్పారు’ తప్పకుండా చేద్దామని అన్ని విధాలా రాయితీలు కూడా ఇస్తామని జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

వాస్తవానికి దగ్గుబాటి కుటుంబానికి విశాఖలో, విజయవాడలోనూ గట్టిగానే భూములున్నాయన్న విషయం విదితమే. ఎన్టీఆర్ హయాం నుంచే వీరికి భూములున్నాయి. ఎంతైనా సొంత రాష్ట్రం కదా అని అప్పట్లోనే దివంగత నిర్మాత రామానాయుడు హయాంలోనే కొనేశారు. కాగా.. ఇటీవలే రామానాయుడు స్టూడియోను మీనాక్షి కన్సట్రక్షన్స్‌కు ఇచ్చేశారని వార్తలు గుప్పుమన్నాయ్.. దీనికి బదులుగా ఏపీలో భారీ ఎత్తున స్టూడియో కట్టుకోవాలని భావించారట. ఇలా మాస్టర్ ప్లాన్‌తో ఒక్కొక్కటిగా సురేశ్ బాబు చేసుకుంటూ వస్తున్నారట. మొత్తానికి చూస్తే దగ్గుబాటి సురేశ్ మాస్టర్ ప్లాన్‌కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న విషయంలో నిజానిజాలెంతో అధికారికంగా తెలియాల్సి ఉంది.

Daggubati Suresh Master Plan.. YS Jagan Green Signal!:

Daggubati Suresh Plan Revealed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ