Advertisementt

కొరటాల తర్వాత చిరు‌తో ఎవరో తెలుసా!?

Fri 28th Feb 2020 05:53 PM
chiru next movie,koratala siva,chiru-koratala combo,sukumar  కొరటాల తర్వాత చిరు‌తో ఎవరో తెలుసా!?
Chiru Next Movie With... Details Here..! కొరటాల తర్వాత చిరు‌తో ఎవరో తెలుసా!?
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. హిట్ చిత్రాల డైరెక్టర్ సుకుమార్.. మెగాస్టార్ చిరంజీవి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయ్ అట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. బన్నీతో సుక్కు సినిమా.. కొరటాల శివతో చిరు మూవీ పూర్తవ్వగానే ఈ కాంబోలో సినిమా చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారట. సుకుమార్‌కు మెగా ఫ్యామిలీకి చాలా మంచి సంబంధాలున్న విషయం విదితమే. అయితే ‘రంగస్థలం’ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యి.. అవార్డు కూడా వరించడంతో ఆ బంధం మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఆ చనువుతోనే చిరుకు సుక్కు బాగా దగ్గరయ్యాడు.

ప్రస్తుతం కొరటాల సినిమాతో బిజిబిజీగా చిరును సుక్కు కలిశాడట. అంతకుముందే ఒకట్రెండు సార్లు ‘సార్.. మనిద్దరం ఓ సారి కూర్చోవాలి’ అని చిరును కోరగా టైమ్‌ చూసుకోని చెబుతానని మెగాస్టార్ అన్నారట. ఇటీవల షూటింగ్ నుంచి ఇంటికొచ్చిన చిరు.. గ్యాప్ దొరకడంతో సుక్కుకు కబురు పంపగా కేరళలో ఉన్న ఆయన కొన్ని గంటల్లోనే వచ్చి మెగాస్టార్ ముందు వాలిపోయారట. ఈ క్రమంలో స్టోరీ లైన్ వినిపించగా.. చిరుకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిందట. కథా చర్చలు అయిపోయిన అనంతరం కొరటాల శివ అవ్వగానే రెడీ అవుదామని సుక్కుకు చెప్పాడట.

అంటే.. ఇటు సుక్కు సినిమా, అటు చిరు సినిమా అయ్యాక.. కాంబోలో సినిమా వస్తుందన్న మాట. వాస్తవానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చిరు సినిమా చేయాలనుకున్నప్పటికీ.. అది వర్కవుట్ అవ్వలేదు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలోనే కొరటాల సినిమా పూర్తి చేస్తానని ఇదివరకే చిరుకు మాటిచ్చాడు. ఆ తర్వాత ఎలాగో చిరు ఖాళీగానే ఉంటారని తెలుసుకున్న సుక్కు కర్చీఫ్ వేసుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Chiru Next Movie With... Details Here..!:

Chiru Next Movie With... Details Here..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ