పాపం బోయపాటి ఏమంటా బాలయ్య సినిమా కోసం ఎదురు చూస్తూ బాలయ్యతో కమిట్ చేయించుకున్నాడో అసలు అనుకున్న ముహూర్తం బాగోలేదో తెలియదు కానీ బోయపాటి - బాలయ్య సినిమా మాత్రం పట్టాలెక్కడానికి మీనమేషాలు లెక్కెడుతున్నారు. నిన్నమొన్నటివరకు బడ్జెట్ లెక్కలన్నారు. నిన్న హీరోయిన్ విషయమై లేట్ అయ్యింది. తాజాగా బాలయ్య అఘోర లుక్ పర్ఫెక్షన్ కోసం సినిమా పూజ కూడా లేట్ అవుతుంది అంటున్నారు. అయితే బోయపాటి మాత్రం బాలయ్యకి నిర్మాతకి మాటిచ్చినట్టుగా... సినిమాని 70 కోట్ల లోపే చుట్టెయ్యడానికి స్క్రిప్ట్ ని చెక్కుతూనే ఉన్నాడు. అయితే బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్స్ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
తాజాగా బాలయ్య సరసన అంజలి ఫిక్స్ అయ్యింది. ఇక రెండో హీరోయిన్ గా త్రిషనో, శ్రియనో అనుకున్నారనే న్యూస్ నడిచింది. కానీ తాజాగా బాలయ్యకి అంజలి ఒక్కతే హీరోయిన్ అని.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉన్నప్పటికీ బడ్జెట్ మినహాయింపు కారణముగా స్క్రిప్ట్ ని కుదించడం కారణంగా ఒక్క హీరోయిన్ తోనే అంటే అంజలితోనే బోయపాటి సరిపెడుతున్నాడట. మరి కవల పిల్లలుగా ద్విపాత్రాభినయం చేస్తున్న బాలకృష్ణ కేరెక్టర్ కి ఇద్దరు హీరోయిన్స్ అవసరమే. కానీ ఓ పాత్రకి ఓ హీరోయిన్ ని సెట్ చెయ్యడం, బాలయ్య అఘోర పాత్రకి హీరోయిన్ లేపెయ్యడం చేసాడట బోయపాటి. అయితే ఈ సినిమా పాత్ర స్క్రిప్టు దశలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ... ఇప్పుడు ఒక హీరోయిన్ పాత్రని తొలగించారని సమాచారం. మరి నిర్మాత, బాలయ్య బడ్జెట్ కంట్రోల్, కంట్రోల్ అంటూ బోయపాటిని ఇబ్బంది పెట్టడంతో బోయపాటి 70 కోట్ల లోపే సినిమా తియ్యాలని అందుకే ఇలా కొన్ని పాత్రలను కుదిస్తున్నాడని అంటున్నారు.